సర్కార్‌ స్కూల్స్‌ వద్దనుకునే వారికి చెప్పుతో కొట్టినట్లు సమాధానం.. ఇతడికి కోటి రూపాయల జీతం

ప్రభుత్వ స్కూల్స్‌ నిర్వీర్యం అయ్యే పరిస్థితికి వచ్చింది.ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో ఎక్కువ శాతం, సీనియర్‌ ఉద్యోగుల్లో చాలా మంది ప్రభుత్వ స్కూల్స్‌లో చదివిన వారే అయినా కూడా ప్రస్తుతం అత్యంత దారుణమైన పరిస్థితులను ప్రభుత్వ స్కూల్స్‌ ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.

 Ap Government School Student Gets 1 Crore Salary In Amazon1-TeluguStop.com

గతలో చిన్న చిన్న పల్లెటూర్లకు చెందిన వారంతా కూడా గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లే వారు.కాని ప్రస్తుతం పరిస్థితి అలాలేదు.

గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్‌ స్కూల్స్‌ అంటూ పట్టణం దారి పడుతున్నారు.అలాంటి వారి తల్లిదండ్రులకు చెప్పుతో కొట్టినట్లుగా అడారి మణికుమార్‌ సమాధానం చెప్పాడు.

సర్కార్‌ స్కూల్స్‌ వద్దనుకున

విశాఖపట్నం జిల్లాకు చెందిన అడారి మణికుమార్‌ ప్రస్తుతం అమెజాన్‌ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు.అమెరికాలో విధులు నిర్వహిస్తున్న అతడికి ప్రస్తుతం అమెజాన్‌ కోటి రూపాయల వార్షిక వేతనం ఇస్తోంది.ఇంతగా సంపాదిస్తున్న ఇతడి చదువు గురించి తెలిస్తే అవాక్కవుతారు.ఇతడు 10వ తరగతి వరకు కూడా ప్రభుత్వ స్కూల్‌లో చదివాడు.ఇద్దరు సోదరిమణులు ఉండటంతో పాటు, తండ్రి ఎక్కువగా ఉన్న వాడు కావడంతో ప్రైవేట్‌ స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి.దాంతో 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు.

సర్కార్‌ స్కూల్స్‌ వద్దనుకున

10వ తరగతిలో 548 మార్కులు సాధించిన ఇతడికి నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీల్లో అవకాశం వచ్చింది.అయిదు సంవత్సరాల పాటు అక్కడ ఇంటర్‌ మరియు ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు.ఇంజనీరింగ్‌లో ఉన్న సమయంలోనే ఇతడు కోడింగ్‌పై పట్టు పెంచుకున్నాడు.దాంతో ఇతడిని బిటెక్‌లో ఉండగానే ఒక కంపెనీ 8 లక్షల వార్షిక వేతనంతో తీసుకుంది.ఆ కంపెనీ నుండి 2015వ సంవత్సరంలో అమెజాన్‌లో జాయిన్‌ అయ్యాడు.అమెజాన్‌లో జాయిన్‌ అయిన సమయంలో అతడి జీతం పాతిక లక్షలు.

కాని నాలుగు సంవత్సరాల్లో అతడి జీతం ఏకంగా కోటికి పెరిగింది.ప్రభుత్వ పాఠశాలలో చదివినా కూడా ప్రతిభ ఉంటే అద్బుతాలు ఆవిష్కరించవచ్చు అనేది మణికుమార్‌ నిరూపించాడు.

మణికుమార్‌ ముందు ముందు అమెజాన్‌లో మరింత గొప్ప పొజీషన్‌కు వెళ్లాలని ఆశిద్దాం.

ప్రైవేట్‌ స్కూల్స్‌కు వెళ్లినంత మాత్రాన పిల్లలు గొప్ప వారు అవ్వరనే విషయాన్ని ఈ సంఘటనతో అయినా పిల్లల తల్లిదండ్రులు గుర్తించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube