తెలుగు బుల్లి తెరపై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న జబర్దస్త్ కామెడీ షో ఎప్పటికప్పుడు కొత్త హంగులు అద్దుకుంటూ, కొత్త కమెడియన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.మొన్నటి వరకు కామెడీ స్కిట్స్‌లో అమ్మాయిలు అంటే అబ్బాయిలే ఆడ వేషం వేసుకుని వచ్చే వారు.
కాని ఇప్పుడు పరిస్థితి మారింది.పలు స్కిట్స్‌లో నిజమైన అమ్మాయిలు వస్తున్నారు.
ఆది ఈ పద్దతిని మొదలు పెట్టాడు.తన స్కిట్లో నిజమైన లేడీ ఆర్టిస్టులను తీసుకు వచ్చి కామెడీ చేయిస్తున్నాడు.
ఆది తర్వాత ఇంకా పలువురు టీం లీడర్లు కూడా తమ టీంలో అమ్మాయిలను తీసుకుంటూ కామెడీ పండించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం టీం మెంబర్స్‌లో కొందరు రియల్ అమ్మాయిలు కూడా ఉంటున్నారు.
కామెడీ సీన్స్ కోసం అమ్మాయిలను వెకిలి చేష్టలతో ఆట పట్టించడం మరియు వారిని తప్పుగా మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం.దాంతో ఆడవారిని విమర్శిస్తారా అంటూ టీం లీడర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
విమర్శలు పట్టించుకోని కొందరు టీం లీడర్లు తమ పద్దతిన తాము వెళ్లి పోతున్నారు.కాని కొందరు మాత్రం ఇలా అమ్మాయిలను తీసుకు వచ్చి, తమ వాడి వేడి పంచ్ డైలాగ్స్‌ను మానేస్తున్నారు.మొత్తానికి జబర్దస్త్ కామెడీ షోను బూతుల షో అంటూ విమర్శిస్తున్న వారికి ఇది ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి.కామెడీ ఎక్కువ పెంచడంతో పాటు, స్కిట్‌కు గ్లామర్ అద్దడం ఇందులో ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
మొత్తానికి జబర్దస్త్‌తో లేడీ కమెడియన్స్ కూడా రావడం హర్షనీయం.