మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ, 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ ని రామ్ చరణ్ చరణ్ నిర్మించిన విషయం తెల్సిందే.ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇండస్ట్రీ హిట్‌గా కూడా నిలిచింది.ఆ చిత్రం సక్సెస్‌తో తన తండ్రితో మరో సినిమాను రామ్ చరణ్ ప్లాన్ చేశాడు.చిరు 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిని రామ్ చరణ్ దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.సినిమా విడుదలకు దగ్గరకు వచ్చింది.
ఇలాంటి సమయంలో రామ్ చరణ్ బిజీ అయ్యాడు.
సైరా విడుదల సమయంలో నిర్మాత రామ్ చరణ్ చూసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి.కాని రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ మూవీ వర్క్‌తో బిజీగా ఉన్నాడు.ఆ సినిమా షూటింగ్‌లో చరణ్ పాల్గొన్నాడు.
రాజమౌళి కోరిక మేరకు ఎలాంటి పనులు పెట్టుకోకుండా పూర్తిగా ఈ చిత్రానికి చరణ్ కమిట్ అయ్యాడు.దాంతో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నిర్మాణానంతర పనులు చూసుకోవడంలో రామ్ చరణ్ విఫలం అవుతున్నాడు.
దాంతో ఆ బాధ్యతను చిరంజీవి నెత్తికి ఎత్తుకున్నాడు.
షూటింగ్ పూర్తి కావచ్చిన నేపథ్యంలో కాస్త రిలాక్స్‌గా ఉన్న చిరంజీవి నిర్మాన కార్యక్రమాలను కూడా చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.రామ్ చరణ్ నిర్వర్తించాల్సిన బాధ్యతలను పూర్తిగా చిరంజీవి చూసుకుంటున్నాడు.చిరంజీవి మొదటి నుండి కూడా నిర్మాణ వ్యవహారాలు చూసుకోలేదు.
కాని ఇప్పుడు తనయుడు అందుబాటులో లేని కారణంగా ఆ పనులు కూడా చూడాల్సి వచ్చిందట.అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైరా చిత్రం విడుదలకు ముందే నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టబోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.