ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ పెట్టి తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్.ఎన్నికల ముందు జనసేన పార్టీ లోకి చాలామంది నేతలు వచ్చినా కూడా అందులో విశాఖపట్నం నుంచి జనసేన పార్టీ ఎంపీగా పోటీ చేసిన మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఏపీలో జగన్ అవినీతి కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన లక్ష్మీనారాయణ ఆ సమయంలో లో ఊహించని విధంగా కావలసినంత పబ్లిసిటీ సొంతం చేసుకున్నారు.ఎలాంటి అవినీతి మచ్చలేని ఐపీఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీనారాయణ రెండేళ్ల క్రితం స్వచ్ఛందంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసింది ప్రజల వద్దకు వచ్చారు.
అప్పటి నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తికర కథనాలు వచ్చిన చివరగా అతను జనసేన పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఇక జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా బరిలోకి దిగిన లక్ష్మీనారాయణ ఊహించని స్థాయిలో ప్రజల నుంచి ఆదరణ పొందినవి కాకుండా అధికార ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు.
ఒకానొక దశలో గెలుస్తారని అందరూ భావించిన ఏవో కారణాలు వల్ల ఆయన ఓటమి చెందారు.ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత గత కొంతకాలంగా లక్ష్మీనారాయణ జనసేన పార్టీని వదిలేస్తున్నారని, బిజెపి పార్టీ నుంచి లక్ష్మీనారాయణకి ఆహ్వానం అందినట్లు వార్తలు వినిపించాయి.
అలాగే బిజెపి పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణకి స్థానం ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.అయితే జేడీ లక్ష్మీనారాయణ ఈ వార్తలకు ఎక్కడ పుల్ స్టాప్ పెట్టకపోయినా తాజాగా జరిగిన కార్యక్రమంలో తాను పార్టీ మారే అవకాశం లేదని తన మాటలతో క్లారిటీ చేశారు.
జనసేన పార్టీ స్థానిక సమస్యలపై నిరంతరంగా పోరాటం చేస్తుందని, ఈ పోరాటంలో తాను కూడా భాగంగా ఉండి తన పంథాలో సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు.ఈ మాటలతో తను జనసేన పార్టీని వీడే అవకాశం లేదని లక్ష్మీనారాయణ బిజెపి పార్టీకి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లు అయింది అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.