'మా' డబ్బులు జీవిత రాజశేఖర్‌ కూతురు అకౌంట్‌లోకి ఎందుకు వెళ్లాయి.. ఏం జరుగుతోంది?

టాలీవుడ్‌ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఈమద్య కాలంలో ఏదో ఒక విషయంలో మీడియాలో ఉంటూనే ఉంది.కొన్ని నెలల క్రితం మా నిధులను అధ్యక్షుడు శివాజీ రాజా దుర్వినియోగం చేస్తున్నాడు అంటూ నరేష్‌ మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టాడు.

 In Rajashekar Daughter Account-TeluguStop.com

ఆ తర్వాత నరేష్‌ అధ్యక్షుడిగా అయ్యాడు.నరేష్‌ మా అధ్యక్షుడిగా గెలిచేందుకు అక్రమ మార్గంలో వెళ్లాడు అంటూ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మీడియా ముందుకు వచ్చాడు.

ఇటీవలే ఎస్వీ కృష్ణారెడ్డి తన వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా మరో షాకింగ్‌ వార్త ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

మా సభ్యుల సంక్షేమం మరియు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన నిధి నుండి కొన్ని రోజుల క్రితం జీవిత రాజశేఖర్‌ కూతురు అయిన శివానీ బ్యాంక్‌ అకౌంట్‌కు దాదాపు 8 లక్షల రూపాయల నగదు ట్రాన్సఫర్‌ అయ్యింది.శివాజీ అకౌంట్‌కు డబ్బు బదిలీ అవ్వడంపై కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

అధికారంలోకి వచ్చి కొన్ని నెలుల అయినా అయ్యిందో లేదో అప్పుడే లక్షలకు లక్షలు డబ్బును ఇలా దోచేస్తే ఎలా అంటూ ఆరోపిస్తున్నారు.ఈ విషయమై అధ్యక్షుడు నరేష్‌ పాత్ర కూడా ఉందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

తనపై వస్తున్న ఆరోపణలకు జీవిత సమాధానం ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చింది.

మా అకౌంట్‌ నుండి తమ కూతురు శివాని అకౌంట్‌లోకి డబ్బు రావడం నిజమే.కాని అందుకు కారణం వేరే ఉందని చెప్పుకొచ్చింది.ఇటీవల మా ఆద్వర్యంలో నిర్వహించిన కొన్ని కార్యక్రమాల కోసం డబ్బు అవసరం అయ్యింది.

ఆ సమయంలో అధ్యక్షుడు షూటింగ్‌ నిమిత్తం వేరే చోట ఉన్న కారణంగా నా వ్యక్తిగత డబ్బును ఖర్చు చేశాను.నేను ఖర్చు చేసిన డబ్బును తిరిగి వెనక్కు తీసుకున్నాను.

ఈ విషయంలో ఎలాంటి దాపరికాలు లేవు, ఎలాంటి గందరగోళం లేదు, దీన్ని కొందరు బూతద్దంలో పెట్టి చూస్తున్నారు అంటూ జీవిత ఆగ్రహం వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube