ఏపీ ఎన్నికల హడావిడి మొదలైంది.ఏప్రిల్ 11న ఎలక్షన్ ఉండబోతుంది అనే విషయాన్ని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసిన నేపధ్యంలో ప్రధాన పార్టీలు మూడు అభ్యర్ధులని ప్రకటించే పని మొదలెట్టాయి.
ఇప్పటికే టీడీపీ తన మొదటి జాబితా అభ్యర్ధులని ప్రకటించింది.మరో వైపు వైసీపీ ఎంపీ అభ్యర్ధుల లిస్టు ని రిలీజ్ చేసింది.
ఇక ఏపీలో అసెంబ్లీ బరిలో వైసీపీ తరుపున పోటీ పడబోతున్న అభ్యర్ధుల మొదటి జాబితాని ప్రకటించేందుకు రెడీ అయ్యింది.దీనికి బుధవారం ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.
తాజాగా వైసీపీ అభ్యర్ధుల జాబితా గురించి ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలియజేసారు.తమ పార్టీ రిలీజ్ చేసే మొదటి జాబితాలో మొత్తం 25 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు ఉంటారని స్పష్టం చేసారు.
అలాగే వరుసగా మూడు రోజులు పాటు 75 మంది అభ్యర్ధులని ప్రకటించడం జరుగుతుందని తెలియజేసారు.ఇక తమ పార్టీకి రెబల్స్, అసంతృప్తుల బెడద లేదని, పక్కాగా గెలుపు గుర్రాలని సిద్ధం చేస్తున్నట్లు తెలియజేసారు.
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితాపై కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో తాజాగా రిలీజ్ కాబోతున్న ఎమ్మెల్యే అభ్యర్ధులపై ఆసక్తి నెలకొని వుంది.