పుల్వామా దాడి సూత్రదారి జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరుడు హమద్ అజార్ ని పాకిస్తాన్ లో అరెస్ట్ చేసారు.దీనికి సంబంధించిన అధికారం సమాచారం బయటకి వచ్చిన నిషేధిత ఉగ్రవాద సంస్థలకి చెందిన ప్రతినిధులని పాకిస్తాన్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక హమద్ తో పాటు జైషే మహ్మద్ సంస్థకి చెందిన ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ ని కూడా పాకిస్తాన్ లో కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
జైషే మహ్మద్ సంస్థ మీద, ఆ సంస్థకి చెందిన ప్రతినిధుల మీద యాక్షన్ తీసుకోవాలని అగ్రదేశాలు నుంచి పాకిస్తాన్ కి వార్నింగ్ వస్తున్న నేపధ్యంలో అంతర్జాతీయంగా తమని ఎవరు తప్పు పట్టకుండా వుండాలని పాకిస్తాన్ ఉన్నపళంగా మసూద్ సోదరుడుని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజార్ మాత్రం కిడ్నీ సంబంధింత సమస్యలతో పాకిస్తాన్ ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని తెలుస్తుంది.ఇక ఉగ్రవాద ముద్ర నుంచి బయట పడటానికి పాకిస్తాన్ ఉగ్రవాదుల ఏరివేతని మొదలెట్టినట్లు తెలుస్తుంది.