పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ స్థావరాలపై సర్జికల్ దాడులు చేసి వారికి భారీ నష్టం ప్రాణ, ఆస్తి నష్టం కలిగించారు.ఇక భారత్ దాడిని సహించలేకపోయిన పాకిస్తాన్ ఇండియాపై ప్రతీకార దాడులకి ప్రయత్నించింది.
అయితే ఇండియా నుంచి అంతే స్థాయిలో ప్రతిఘటన ఎదురుకావడంతో పాటు, అగ్ర దేశాల నుంచి పాకిస్తాన్ మీద ఒత్తిడి రావడంతో తప్పనిసరి పరిస్థితిలో పాకిస్తాన్ వెనక్కి తగ్గింది.ప్రస్తుతానికి కొంత వరకు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తగ్గింది అని చెప్పాలి.
ఇదిలా వుంటే పుల్వామా తరహాలో భారత్ పై మరిన్ని దాడులకి ఉగ్రవాద సంస్థలు కుట్రలు చేస్తున్నాయని ఐబీ, ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఎప్పుడైన, ఎలా అయిన దాడులకి పాల్పడే అవకాశం వుందని తెలుస్తుంది.
ఇదిలా వుంటే ఇక నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో త్రివిధ దళాలని అప్రమత్తంగా ఉంచిన రక్షణ శాఖ వారిని పూర్తిగా నియంత్రించే పనిలో వున్నట్లు తెలుస్తుంది.ఎన్నికల అనంతరం మిగిలిన ఉగ్ర స్థావరాలని కూడా టార్గెట్గా చేసుకొని సర్జికల్ దాడులకి పాల్పడాలనే లక్ష్యంతో మోడీ వున్నట్లు కూడా తెలుస్తుంది.