అమెరికాలో న్యూజెర్సీ లోని మార్సెల్ పేపర్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఒక్క సారిగా మంటలు అంతా వ్యాపించి పేపెర్ మిల్లు పూర్తిగా కాలిపోయింది.
ఒక్కసారిగా ఈ మంటలు వ్యాప్తి చెందటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలని అదుపులోకి తీసుకొచ్చారు
అయితే ఈ మంటలలో కేవలం ఆస్తినష్టం మాత్రమే జరిగిందని ఎక్కడ ప్రాణ నష్టం కలగలేదని అధికారులు తెలిపారు.సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలెర్ట్ అవ్వడం వలెనే మరింత భారీ నష్టం జరగలేదని.సకాలంలో రాకుండా మంటలు చుట్టూ వ్యాపించేవని అన్నారు.
ఇదిలాఉంటే ఒక వైపు తీవ్రమైన మంచు అమెరికాని చుట్టూ ముడుతుంటే, తీవ్రమైన మంచు మరోవైపు ఫ్యాక్టరీలో ప్రమాదం జరుగడంతో మంటలు అదుపుచేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు.పది అగ్నిమాపక వాహనాలతో భారీ ఎత్తులో వ్యాప్తి చెందితున్న మంటలని అదుపులోకి తీసుకువచ్చారు.ఈ ఘటనని పరిశీలించడానికి ఫ్యాక్టరీ వద్దకు శిథిలాలను న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ ముర్ఫే వచ్చి భాదితులని పరామర్శించారు.
తాజా వార్తలు