చంద్రబాబు తో పొత్తు అంటేనే కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.తెలంగాణాలో ఎన్నికల ముందుగానే బాబు తో పొత్తు విషయంలో ఏపీలో టీడీపీ నీలు ఎన్నో అభ్యంతరాలు తెలిపారు.
కొందరైతే ఏకంగా కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి పడేశారు.అయినా సరే కాంగ్రెస్ తెలంగాణలో పొత్తు పెట్టుకుని చిత్తు చిత్తు అయ్యింది.
దాంతో చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ ఏపీలో సైతం బాబు తో పొత్తుకి ఒకే చెప్పేస్తోంది.ఈ క్రమంలోనే ఏపీలో మరింత అసమ్మతి గళం వినిపిస్తోంది.

ముఖ్యంగా రాయలసీమలో కాంగ్రెస్ నేత అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుని ఏకి పడేశారు.తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు వాడిన డైలాగులను, బాబు వేసిన పాచికలు పారలేదని ఎద్దేవా చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం చంద్రబాబు తెలుగుదేశమే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు ఏపీలో మళ్ళీ ఇదే పొత్తు రిపీట్ అవుతుంది అనుకుంటున్న సమయంలో బైరెడ్డి ఏపీలో కూడా ఇదే కొనసాగితే పొత్తు చిత్తు చిత్తే అంటూ కామెంట్స్ చేశారు.
అంతేకాదు ఇదే వేదికపై నుంచీ బైరెడ్డి మరొక విషయాన్ని ప్రస్తావించారు.ఏపీలో అన్ని అసెంబ్లీ – పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.
కర్నూలులో సత్యమేవ జయతే పేరిట నిర్వహించిన సభకి జనం స్వచ్చంధంగా తరలివచ్చారని అన్నారు.బాబు తలపెట్టిన ధర్మ పోరాట దీక్షకి జనాలని తరలించినా రాలేదని ఎద్దేవా చేశారు.
అయితే ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రిందట.కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తు ఉండకపోవచ్చని తెలిపారు.

అయితే తాజా పరిస్థితులకి అనుగుణంగానే కాంగ్రెస్ కావాలనే తమ నేతలతో ఈ ప్రకటనలు చేయిస్తోందని అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే.ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ ,కాంగ్రెస్ కలయికని ప్రజలు ఒప్పుకోవడంలేదు.ఈ ప్రభావం ఎలా ఉందొ తాజా తెలంగాణా ఫలితాలతో తెలిసివచ్చింది కాబట్టి ప్రస్తుతానికి ఏపీలో పొత్తు విషయంలో ఎటువంటి సానుకూల ప్రకటనలు చేయకపోవడమే మంచిదనే ఉద్దేశ్యంలో ఇరు పార్టీలు ఉన్నాయనేది విశ్లేషకులు అభిప్రాయం.ఏది ఏమైనా సరే తెలంగాణా రిజల్స్ దెబ్బతో.
ఏపీలో టీడీపీ దిక్కు తోచని స్థితిలో ఉందనేది మాత్రం వాస్తవం అంటున్నారు రాజకీయ పండితులు.