ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సు బ్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో బస్సు ఎక్కాలంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు.అలాంటిది నిండుగా జనాలున్న బస్సును ఓ కొండముచ్చు నడిపితే అనులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుంది.? భయం భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిందే.
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ దావణగెరె డివిజన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న ప్రకాష్ బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి ఓ కొండముచ్చుకి స్టీరింగ్ అప్పజెప్పాడు.అది డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పుతుంటే చోద్యం చూశాడు.ఈ వీడియోని చిత్రీకరించిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పెట్టాడు.
ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ చూసిన అధికారులు డ్రైవర్ ప్రకాష్ ని సస్పెండ్ చేశారు.
ఈ నెల 1న దావణగెరె నుంచి బ్రహ్మసాగర వెళ్తున్న బస్సులోకి ఓ ఉపాధ్యాయుడితో పాటు కొండముచ్చు ఎక్కింది.
రోజూ చూసే కొండముచ్చు కావడంతో డ్రైవర్ ప్రకాష్ దానిని ఒడిలో కూర్చోపెట్టుకొని స్టీరింగ్ అప్పజెప్పాడు.భయాందోళనలకు గురైన ప్రయాణికులు అభ్యంతరం చెప్పినా వినిపించుకోలేదు.
ఓ చేత్తో కొండముచ్చుని నిమరడం మరోచేత్తో స్టీరింగ్ పట్టుకొని నవ్వుతూ కూర్చొన్నాడు.దీంతో ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్ని వీడియో తీశాడు.
వీడియోలో కొండముచ్చు అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది.