ప్రియా ప్రకాష్ వారియర్.గత కొద్ది రోజుల క్రితం నుంచి ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది.
ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే ఈమె గురించిన అనేక వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తూనే ఉన్నాయి.కేవలం ఒక కంటి చూపుతో ఈమె కుర్రకారు మదిని దోచేయడమే కాదు, అటు సినీ ప్రపంచాన్ని, మరో వైపు కార్పొరేట్ కంపెనీల చూపును కూడా ప్రియా తన వైపుకు తిప్పుకుంది.
అప్పట్లో డబ్బులు కూడా అదేరేంజిలో సంపాదించింది.కానీ అన్ని సమయాలు ఒకేలా ఉండవు కదా.ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రియా వారియర్ పరిస్థితి అయోమయంలో పడింది.
ఆమె ఇంటర్నెట్ సెన్సేషన్ కావడంతో ఆమెతో సినిమాలు చేయాలని టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు భావించారు.ప్రియావారియర్‌కి సినిమాల్లో ఎన్ని అవకాశాలొచ్చినా చదువు పూర్తయిన తరువాతే అంటూ అన్నీ తిప్పి కొడుతోంది.అందుకుకని దర్శక నిర్మాతలు కొన్నిరోజుల తరువాత ఆమె వెనుక పడటం మానేశారు.
దీంతో ప్రియా కనీసం యాడ్స్ లోనైనా నటించి డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచనలో ఉందట.
యాడ్స్ అయితే కొద్దీ రోజుల్లోనే అయిపోతుంది.
చదువుకి ఆటకంకం ఉండదు అనుకుంది ప్రియా.ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా కూడా సంపాదించడం మొదలుపెట్టింది.
ఎక్కువ మంది ఫోలోవెర్స్ ఉండటంతో లక్షల్లో డిమాండ్ చేసింది.మొదట్లో యాడ్ సంస్థలు అంత డబ్బు చెల్లించాయి.
కానీ ప్రస్తుతం ఆమె క్రేజ్ కూడా పడిపోతుండటంతో యాడ్స్ అవకాశాలు కూడా తగ్గుతున్నాయి.దాంతో ప్రియా ప్రకాష్ వారియర్ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్‌గా ఉంటోందట.