సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో అన్ని పార్టీల్లోనూ ఒకటే కంగారు మొదలయ్యింది.గత ఎన్నికలతో పోలిస్తే ప్రతి పార్టీకి ఇప్పుడు కొంచెం ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి.
ఇప్పుడు దాదాపు ప్రతి పార్టీ కూడా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.ప్రస్తుతం జనసేన పార్టీ తరపున పవన్ వంటి బలమైన యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో రంగంలోకి దిగుతున్నారు.
ఇక, గత ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన జాతీయ పార్టీ కాంగ్రెస్, కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఏపీలో పాగా వేయాలనే లెక్కల్లో ఉన్నాయి.
ఇక ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ కి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్ఠతమకమే.
మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు బాబు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.ప్రజా సంక్షేమ కార్యక్రమాలను భారీ ఎత్తున అమలు చేస్తున్నారు.
అందరికీ అన్నీఅనే విధంగా ఆయన ఇప్పటికే పలు పథకాలు ప్రారంభించారు.ఇక, కులాల వారీగా కూడా ఆయన పలు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి.
వాటి ద్వారా లబ్ధి చేకూరుస్తు న్నారు.సామాజిక పింఛన్లను అందరికీ అందిస్తున్నారు.
ఇలా ప్రతి ఒక్కరినీ ఆయన తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
వైసీపీ విషయానికి వస్తే.జగన్ ప్రస్తుతం చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర సెప్టెంబరు 2 నాటికి పూర్తి చేసేలా ఆయన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు.అనంతరం ఎన్నికలకు మూడు మాసాల ముందు.
రాష్ట్ర మంతటా బస్సు యాత్ర చేయాలని పాదయాత్రలో కలవని నియోజకవర్గాలను బస్సు యాత్రలో కలిసి పార్టీని పుంజుకునేలా చేయాలని జగన్ ప్లాన్ చేసుకున్నారు.ఇదే సమయంలో గెలుపు గుర్రాలకు టికెట్లు ఖరారు చేయాలని జగన్ చూస్తున్నాడు.
జనసేన విషయానికి వస్తే.ప్రస్తుతం ఉత్తరాంధ్రను టార్గెట్ చేసుకున్న పవన్.
త్వరలోనే రాయల సీమలో ప్రచారం ప్రారంభించనున్నారు.అదే సమయంలో పార్టీలో జోష్ నింపడానికి ముందుగానే కార్యకర్తలను, నాయకులను ఆయన చేర్చుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ పోటీకి రెడీ అవుతున్నట్టు పవన్ ఇప్పటికే ప్రకటించారు.ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టినా రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి చెందిందంటే అది మోడీ చలవేనని, బీజేపీకి ఓట్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.