సంతోషంగా జైలుకెళ్తా.....!

సంతోషంగా సినిమాకెళ్తా అన్నంత తేలికగా సంతోషంగా జైలుకెళ్తా అన్నాడు ‘పవర్‌ స్టార్‌’ పవన్‌ కళ్యాణ్‌.జైలుకెళ్లేంతగా ఎదిగిపోయాడా ఈ హీరో…? ‘జనసేన’ పార్టీ పెట్టాడుగాని పూర్తికాలపు రాజకీయవేత్తగా మారలేదు కదా…! ఇప్పటివరకు ఏ సమస్యపైనా ఉద్యమం చేయలేదు కదా…! కాకపోతే అప్పుడప్పుడు రాజకీయ నాయకులను విమర్శిస్తున్నాడు.తాజాగా మొన్న మరోసారి ఆ పని చేశాడు.టీఆర్‌ఎస్‌, టీడీపీ, భాజపా నాయకులను మూకుమ్మడిగా విమర్శించాడు.అంతమాత్రానికే ‘సంతోషంగా జైలుకెళ్తా’ అనడం ఎందుకు? ఎందుకన్నాడంటే….పవన్‌ కళ్యాణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడంటూ తెలంగాణ న్యాయవాదులు కొందరు జూబ్లీహిల్‌్స పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

 I Will Be Very Happy To Go To Jail Says Pawan Kalyan-TeluguStop.com

ఈ సంగతి పవర్‌ స్టార్‌కు తెలిసింది.వెంటనే ఆయన ట్విట్టర్లో ”నేను సంతోషంగా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను” అని ట్వీట్‌ చేశాడు.

వెంటనే ఆ పనిచేయండని (జైలుకు పంపాలని) కూడా కోరాడు.పవన్‌ ట్వీట్‌ చేసింది సినిమా డైలాగ్‌ మాదిరిగా ఉన్నా ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడాడని చెప్పుకోవచ్చు.

నిజానికి ఆయన తన ప్రసంగంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసించారు.తెలుగు జాతి ఐక్యతకు ఆయన తొలి అడుగు వేశాడని కూడా అన్నారు.‘తిడితే కేసీఆర్‌లా తిట్టాలని…పడుంటే ఆంధ్రా ఎంపీల్లా పడుండాలని’ కూడా అన్నారు.ఇలాంటి వ్యాఖ్యలకు పెడితే ఆంధ్రా నాయకులో, అక్కడి లాయర్లో కేసు పెట్టాలి.

పవన్‌ మంత్రి హరీష్‌రావును విమర్శించాడేగాని కేసీఆర్‌ను ఏమీ అనలేదు.హరీష్‌రావు ఈ వ్యాఖ్యలను పట్టించుకోలేదు.కాని తెలంగాణ లాయర్లకు మాత్రం కోపం వచ్చేసింది.ఎందుకో….?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube