జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమాలలోకి వచ్చారు.సినిమా హీరో అయ్యారు.
పవర్ స్టార్ అయ్యారు.అయితే రాజకీయాల్లోకి వచ్చారు.
మెరుపు తీగలా కనిపిస్తారు…నేతలని ప్రశ్నిస్తారు.విమర్శిస్తారు.
ఎవడ్రా వాడు అంటారు.అయితే ఇప్పుడు అందరిలానే పరిపూర్ణ రాజకీయ నాయకుడు అయ్యాడు.
పెద్ద తేడా ఏమి లేదు.కాకపోతే ఈయనకి కొంచం తిక్క ఎక్కువ అంతే.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ప్రతీ ఒక్కరి మదిలో,ఆఖరికి పవన్ ఫ్యాన్స్ మదిలో కూడా మెదిలే ఒక కన్ఫ్యూజ్ ప్రశ్న ఇదే.అసలు వీటన్నిటికీ కారణం గత కొంతకాలంగా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, మాట్లాడే మాటలు.చేసే చేష్టలు.అసలు పవన్ అజెండా అంటో జెండా మోస్తూ తిరిగే ఫ్యాన్స్ కి కూడా తెలియదు.అంతెందుకు జిల్లాల వారిగా నియమిస్తున్న వారికి కూడా తెలుసా అంటే వారి మొఖంలో ప్రశ్న గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది.అయితే పవన్ దగ్గర ఉన్న ఒకే ఒక్క అస్త్రం తన సినీ గ్లామర్ , తన గావు కేకలు, పవన్ ఏమి చేసినా పరవాలేదు మేము తలలు ఊపుతాం అంటే ఫ్యాన్స్.
ఇవే తన బలం.అయితే పవన్ మాత్రం ఒకే ఒక్క విషయం మర్చి పోయాడు.కొన్ని కోట్ల మంది ప్రజలకి కలిగించాల్సిన నమ్మకం.ఇప్పుడు ఆ నమ్మకమే ఫ్యాన్స్ లో కూడా పోతోంది అని టాక్ మాత్రం ఉంది.
తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు.చంద్రబాబు లో కనిపించిన అవినీతి.
మొన్న 2014 లో టిడిపికి మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు కనపడలేదు అనేది ఫ్యాన్స్ కి ప్రశ్న గానే మిగిలిపోయింది.దీని మీద పవన్ ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు తెలుగు ప్రజలకి.
ఓట్లు వేయమని నేను అడిగాను వీళ్ళు కనుకా మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పొతే ప్రస్నిస్తాను నేను జవాబు దారీ అంటూ చెప్పిన పవన్ ఇప్పటికి ఎన్ని విషయాలలో ప్రశ్నించాడు.అంటే నో ఆన్సర్.
ప్రత్యేక హోదాపై ఉద్యమం చేస్తా అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి సినిమాలు చేసుకుంటున్న పవన్ ఇప్పుడు ఏరకంగా తెలుగు ప్రజలకి నమ్మకం కలిగిస్తాడు అంటే ఇదీ ఒక పెద్ద ప్రశ్నే.
వారసత్వ రాజకీయాలపై ,జగన్ లాంటి ప్రతిపక్ష నేతలపై అవినీతి కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్.
సినిమాలో వారసత్వాల వలన ఎంతో మంది నటులకి అవకాశాలు రావడం లేదు అనేది జగమెరిగిన సత్యం.మరి ఇదే ప్రశ్న ప్రతిపక్షాలు వేసినపుడు జగన్ మిన్నకుండి పోయాడు.
ఎందుకు.? అంటే ఇప్పటికీ సమాధానం లేదు.పవన్ పై ఇప్పటికీ రాష్ట్రప్రజలు ఒక క్లారిటీకీ వచ్చేశారు అదేమిటంటే పవన్ కి క్లారిటీ లేదు అని.గత ఎన్నికల్లో పవన్ ని నమ్మి మోసపోయినట్టు ఇప్పుడు ఎవరు సిద్దంగా ఉన్నట్లు కనిపించడంలేదు.హుందాగా కనపడటానికి ఖద్దరు లాల్చీ వేసుకుంటే సరిపోదు.ఎదో పరమాత్ముడిలా.తెగించే తెలుగు ఉన్నవాడిలా గావు కేకలు పెడితే సరిపోదు.నమ్మకం ముఖ్యం అది పవన్ ఎప్పుడో ఏపీ ప్రజల నుంచీ కోల్పోయాడు అనేది సత్యం.