ఎర్రజెండా పార్టీ అంటేనే సమస్యల వైపు పోరాటం చేయడం, అవినీతి ప్రభుత్వాల భరతం పట్టి, నాయకులను నిలదీయడం, ప్రజా ఉద్యమాలు జరపడం వంటివి చేస్తూ ఉంటారు.ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ( CPI ) , సిపిఎం ( CPM ) పార్టీలు ప్రజల వైపు పోరాడుతూ, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకెళుతున్నాయి.
అయినా ఈ కమ్యూనిస్టులకు ఈసారి ఎలక్షన్స్ లో కాస్త ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయి.ఇప్పటికే ఎర్రన్నలను మునుగోడు ఎలక్షన్స్ లో వాడుకొని బీఆర్ఎస్ సర్కార్ ఆ సీటును గెలిపించుకుంది.
మునుగోడు ఎలక్షన్స్ టైంలో మనం ఎప్పుడూ కలిసే ఉండాలని , రాబోవు ఎలక్షన్స్ లో కూడా మీకు సమచిత స్థానం కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ , తీరా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి కమ్యూనిస్టులను విసిరి పారేసారని చెప్పవచ్చు.
నీతో మాకు పొత్తు కుదరదని డైరెక్ట్ గానే చెప్పేశారు.దీంతో గుర్రు మీద ఉన్న కమ్యూనిస్టులు సొంతంగా పోటీ చేసిన ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు.ఇక వారిని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ ( Congress ) అనుకొని కాంగ్రెస్ వైపు వెళ్లారు.
సీట్ల కేటాయింపులో చెరో 5 సీట్లు కావాలని కాంగ్రెస్ అధిష్టానం ముందు ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తోంది.కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రం కమ్యూనిస్టులతో పొత్తు అవసరం లేదు.
మనం ఏ స్థానంలోనైనా సొంతంగా పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారట.
ఈ తరుణంలోనే అధిష్టానం కూడా కాస్త ఆలోచించి చెరో రెండు సీట్లు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.మరి వీరికి ఎక్కడెక్కడ ఈ సీట్స్ ఇస్తారు అనేది ఫైనల్ కాలేదు.అక్టోబర్ 15వ తేదీన కాంగ్రెస్ తొలి జాబితా వెలువడనున్న నేపథ్యంలో సిపిఐ, సిపిఎం స్థానాలపై కనీసం చర్చ కూడా చేయలేదట.
అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున కార్గే ( Mallikharjuna Karge ) గారి అధ్యక్షతన జరిగే పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో లెఫ్ట్ పార్టీలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలి, ఏ ఏ స్థానాలను కేటాయించాలనేది మొదటి జాబితా వెలువడిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది.అయితే సిపిఐకి కొత్తగూడెం( Kothagudem ) , మునుగోడు, సిపిఎంకు భద్రాచలం, మిర్యాలగూడ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇందులో సిట్టింగ్ స్థానంలో ఉన్న భద్రాచలాన్ని అసలు వదులుకోవద్దని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్క్రీనింగ్ కమిటీకి వెల్లడించినట్టు సమాచారం.దీంతో లెఫ్ట్ పార్టీల నేతలు కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారు తప్ప ఎక్కడ సీట్లు ఖరారు అవడం లేదు.
అటు బిఆర్ఎస్ ( BRS ) వెళ్లగొట్టడంతో, ఇటు కాంగ్రెస్ నాలుగే సీట్లు తీసుకోవాలనడంతో , అటు పోలేక, ఇటు రాలేక లెఫ్ట్ ఫార్టీ నేతలు కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.