ఆ నటుడి కెరీర్ ని తొక్కేసింది చిరంజీవే అంట

మెగాస్టార్ చిరంజీవిది దశాబ్దాల కెరీర్.ఎన్నో దాటుకొని మెగాస్టార్ గా ఎదిగారు.

 Actor Giribabu Accuses Chiranjeevi For Ruining His Son’s Career-TeluguStop.com

ఈ క్రమంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు.సుమన్ కెరీర్ ని నాశనం చేసింది ఆయనే అన్నారు.

కాని సుమన్ స్వయంగా మెగా స్టార్ మంచితనం గురించి చెప్పారు.ఉదయ్ కిరణ్ కెరీర్ ని తొక్కేసింది ఆయనే, ఉదయ్ కిరణ్ చావుకి కారణం ఆయనే అన్నారు, కాని అందులో కూడా వాస్తవం లేదని ఆ తరువాత తేలింది.

కాని తన కొడుకు కెరీర్ ని తొక్కేసింది చిరంజీవినే అని స్వయంగా ఓ సీనియర్ నటుడు చెబుతున్నారు.ఆ సీనియర్ నటుడే గిరిబాబు.

ఆయన చెప్పిన మాటల ప్రకారం .గిరిబాబు కుమారుడు బోస్ “ఇంద్రజిత్” అనే కౌబాయ్ సినిమాతో తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా నిర్మిస్తున్న సమయంలోనే చిరంజీవి మరో కౌబాయ్ సినిమా “కొదమసింహం” చేస్తున్నారు.ఇంద్రజిత్ ముందు విడుదల కావాల్సిన సినిమా, కొదమసింహం ఓ నెల రోజుల గ్యాప్ లో రావాల్సిన సినిమా.

కాని ఇంద్రజిత్ ఫస్ట్ కాపీకి ఇండస్ట్రీలో వచ్చిన రెస్పాన్స్ చూసిన చిరంజీవి సడెన్ గా కొదమసింహం విడుదలని అనౌన్స్ చేసారట.దాంతో ఇంద్రజీత్ ని విడుదల చేసేందుకు సాహసించలేదు పంపిణిదారులు.

ఆ తరువాత ఎవరు ఊహించని విధంగా కొదమసింహం ఫ్లాప్ గా నిలిచింది.ఈ ఫలితం ఎఫెక్ట్ గిరిబాబు కొడుకు సినిమాపై పడిందట.

మెగాస్టార్ సినిమానే నష్టాలు తీసుకొచ్చింది, ఇది కూడా కౌబాయ్ సినిమా అంటున్నారు అని పంపినిదారులు రెట్లు తగ్గిస్తే కాని కొనలేము అని చేతులు ఎత్తేసారట.దాంతో గిరిబాబు బడ్జెట్ కన్నా తక్కువ రేటులోనే సినిమాని అమ్మేసారట.

కాని మళ్ళీ ఎవరు ఊహించనివిధంగా ఈ చిన్న సినిమా వారికి లాభాలు తీసుకోచ్చిందట.తన కొడుకు సక్సెస్ చూసి ఓర్వలేని కొందరు ఇంద్రజీత్ ఫ్లాప్ అని ప్రచారం చేయించారని, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు తొక్కడం సినిమాల్లో, రాజకీయాల్లో ఆనవాయితీ అంటూ వాపోయారు.

ఈరకంగా మెగాస్టార్ మీద కొత్త ఆరోపణ వచ్చిపడింది.మరి చిరంజీవి ఈ విషయం మీద తన స్పందన తెలియజేసి అసలేం జరిగిందో చెబుతారా లేక ఊరికే గాలికి వదిలేస్తారా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube