ఏపీలో కేబినెట్ ప్రక్షాళన వార్తలు గత యేడాది కాలంగా మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అయ్యాయి.ఊరించి.
ఊరించి ఎట్టకేలకు మంత్రివర్గ ప్రక్షాళనకు చంద్రబాబు ఏప్రిల్ 2న ముహూర్తం ఫిక్స్ చేశారు.ఈ మంత్రివర్గ ప్రక్షాళన భారీ స్థాయిలోనే ఉంటుందని కూడా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
బాబు కేబినెట్‌లో ఖాళీగా ఉన్న 6 స్థానాలను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఐదుగురు మంత్రులను తప్పించి వారి స్థానంలో మరో ఐదుగురు కొత్త మంత్రులను తీసుకుంటారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే
ఇదిలా ఉంటే కేబినెట్ నుంచి ఊస్టింగ్ తప్పదని వార్తలు వస్తోన్న మంత్రులకు ఇప్పటికే సమాచారం అందడంతో వారు తమ అనుచరులు, సన్నిహితుల ద్వారా బాబుకు హెచ్చరిక ధోరణితో కూడిన మెసేజ్‌లు పంపినట్టు టాక్.కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని వార్తలు వస్తోన్న వారిలో ఇద్దరు మంత్రులు తమను తప్పిస్తే తాము పార్టీనే వీడతామని తమ సన్నిహితుల వద్ద హెచ్చిరిక ధోరణితో వ్యాఖ్యలు చేస్తున్నారట
గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిషోర్‌బాబు మీద వచ్చిన ఆరోపణలకు లెక్కేలేదు.
ఈ క్రమంలోనే రావెలను తప్పిస్తే దళిత వర్గానికి చెందిన మంత్రిని తప్పించారన్న ఆపవాదు వస్తుందని భావించిన చంద్రబాబు అదే జిల్లాలో ఉన్న మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లరావుతో కలిపి రావెలను కూడా తప్పించాలన్న నిర్ణయానికి వచ్చారట.అందుకే చంద్రబాబు వీరిద్దరిని తప్పించి వీరి ప్లేస్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వినుకొండ ఎమ్మెల్యే జివి.
ఆంజనేయులతో పాటు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబుకు చోటు కల్పిస్తారని తెలుస్తోంది
ఇక కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కేఈ.కృష్ణమూర్తిని ఆరోగ్య కారణాలు చూపించి తప్పించాలని బాబు భావిస్తున్నారట.ఇప్పటికే కేఈకి బాబుకు పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా ఉంది.ఈ క్రమంలోనే ఆయన కూడా తనను తప్పిస్తే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చిరికలు పంపారట.
దీంతో చంద్రబాబు కేబినెట్ నుంచి తప్పించే మంత్రుల విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారా ? అన్నది కాస్త సస్పెన్స్‌గానే ఉంది.