కొన్ని నెలల్లో తెలంగాణ రాష్ట్రం (Telangana State) లో ఎన్నికలు జరగబోతున్నాయి.ఇదే తరుణంలో అన్ని పార్టీలు మూడు సభలు ఆరు స్పీచ్ లు అంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి పకడ్బందీగా ప్రచారంలో మునిగిపోయింది.కాంగ్రెస్, బిజెపిలు తమదైన శైలిలో బిఆర్ఎస్ (BRS) ను పడగొట్టాలని ముందుకు వెళుతున్నాయి.
ఇదే తరుణంలో సభల మీద సభలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే సెప్టెంబర్ 17వ తేదీ రాష్ట్ర ప్రజలందరికీ చాలా ఆసక్తికరంగా మారింది.
సెప్టెంబర్ 17న కేంద్ర బిజెపి పార్టీ పరేడ్ గ్రౌండ్స్ (Pared Ground) లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతోంది.ఈ సభకు కేంద్ర మంత్రులు అమిత్ షా సహా ఇతర బడా నాయకులు వస్తున్నారు.
అలాగే తుక్కుగూడ (Tukkuguda) లో కాంగ్రెస్ కూడా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది.ఈ సభకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు ఇతర సీనియర్ లీడర్లు అంతా హాజరవుతున్నారు.
ఈ సభలోనే వారు ఫ్యూచర్లో అధికారంలోకి వస్తే చేయబోయేటువంటి పథకాల గురించి ప్రకటన చేయనున్నారు.దీంతో రాష్ట్ర ప్రజలందరికీ ఈ రెండు సభలపై ఆసక్తి నెలకొంది.
ఇదే తరుణంలో హైదరాబాద్ (Hyederabad) లో పలు ప్లెక్సీలు వెలిశాయి.బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ప్రశ్నిస్తూ ఆ ఫ్లెక్సీలను కట్టారు గుర్తుతెలియని వ్యక్తులు.

1.గోవా లిబరేషన్ డేకు 300 కోట్లు ఇచ్చిన మోడీ ప్రభుత్వం తెలంగాణ నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేకు ఒక్క రూపాయి కూడా అందించలేదు.మరి 17న తెలంగాణకు వస్తున్న అమిత్ షా (Amith sha) ఏమైనా ప్రకటిస్తారా అంటూ బిజెపిని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
2.తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు కేసీఆర్ (KCR) 2016 రూపాయలు ఇస్తున్నారు.మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వృద్ధులకు ఎంత పింఛన్ ఇస్తున్నారు అంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీ వేశారు.
3.రంగారెడ్డి పాలమూరు (Rangareddy Palamuru) ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తానన్న రాహుల్ సోనియా ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.

4.అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ నుంచి ఐటీ మంత్రిగా ఉండి కూడా వరంగల్ కి ఒక్క ఐటి కంపెనీ ఎందుకు తీసుకురాలేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
5.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) రైతుల వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు చాలంటున్నారు.దానిపై మీ సమాధానమేంటంటూ కాంగ్రెస్ ను ప్రశ్నించారు.
6.2004 నుంచి 2014 వరకు అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ చేయలేదు.కానీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ డిక్లరేషన్ లో చెప్పినవన్నీ పాటిస్తామని అంటున్నారు.
అది ప్రజలు నమ్ముతారా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రశ్నించడంతో ఆ ప్లెక్సీ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
.






