ఇదే ఏడాది మార్చి 7న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ పాసింజర్ ట్రైన్ లో జరిగిన బాంబు దాడి గుర్తుందా? ఈ దాడి చేసిన తీవ్రవాదులు ఆతిఫ్ ముజఫర్, మొహమ్మద్ డానిష్ పోలీసులకి చిక్కారు కూడా.ఇప్పుడు వారిని జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తుండగా, ఒక షాకింగ్ నిజం బయటపడింది.
వీరు నరేంద్ర మోడిని చంపాలని ప్లాన్ చేసారట.కాని ఆదృష్టవశాత్తు మన ప్రధాని మీద దాడి జరగలేదు.
వివరాల్లోకి వెళితే, గత ఏడాది దసరా ఉత్సవాల సమయంలో ప్రధాని లక్నోలో ఓ ర్యాలి నిర్వహించారు.రాంలీలా మైదానం దగ్గర ఆయన్ని చంపేందుకు ప్లాన్ వేసారు తీవ్రవాదులు.
మైదానం దగ్గరే ఓ చెత్తబుట్టిలో బాంబు పడేశారట.ప్రధాని రాంలీలా మైదానానికి దగ్గరగా రాగానే ఆ బాంబుని పేల్చి, మోడి ప్రాణాలు తీసుకోవాలనేది ప్లాన్.
కాని బాంబు పేలలేదు.మోడి మీద ప్లాన్ చేసిన దాడి విఫలయత్నంగానే మిగిలిపోయింది.
ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు?ఎలా తెలిసిందో, ఎవరి ద్వారా తెలిసిందో, అసలు అనుమానం ఎందుకు వచ్చిందో, అసలు ఎవరు తొలిగించారో కూడా సరైన సమాచారం లేదు .బాంబు చెత్తబుట్టులోంచి మాయమైపోయిందట.బాంబు వైర్స్ కి కనెక్ట్ అయి ఉంటే కదా వీరు నొక్కగానే పేలేది.అక్కడ వైర్లు మాత్రమే ఉన్నాయి.వెంటనే అక్కడికి వెళ్ళడం కుదరక రెండురోజుల తరువాత చెత్తబుట్ట దగ్గరికి వెళ్ళారట ఉగ్రవాదులు, చూస్తే వైర్స్ మాత్రమే ఉన్నాయి.
బాంబులు తయారుచేయండలో నేర్పరులైన వీరిద్దరు, స్టీలు పైపులు, బల్బులతో కుడా బాంబులు తయారుచేయగలరట.
సిగ్గుపడాల్సిన విషయం ఏమింటంటే, వీరికి సహాయసహకారాలను అందించింది ఒక మాజీ భారతీయ వాయుసేన ఉద్యోగి.అదృష్టం కొద్దీ వీరు ఆ తరువాత మరికొన్ని పెద్ద దాడులు ప్లాన్ చేసినా, ఏది సఫలం కాలేదట.
చివరకి ఉజ్జయిని ట్రెయిన్ దాడిలో సఫలమై, భారత్ నుంచి సీరియా లేదా ఇరాక్ పారిపోయే ప్రయత్నాల్లో ఉండగా భారతీయ అధికారులు పట్టుకోని కస్టడిలోకి తీసుకున్నారు.