ఫేస్ బుక్ లోకి కూడా వీడియోలు తీసుకొచ్చినప్పుడు చాలామంది ఆహా, ఓహో అంటూ పొగిడారు.ఇక యూట్యూబ్ కి పోటి తప్పదని తొడగొట్టారు ఫేస్ బుక్ ఫ్యాన్స్.
వీడియో విభాగంలో ఇంకా యూట్యూబే రారాజు, అది వేరు విషయం కాని, ఒకప్పుడు బాగా అనిపించినా ఫేస్ బుక్ వీడియోలు ఇప్పుడు చిరాకు తెప్పిస్తున్నాయి.ఒకప్పుడు మనకి ఇష్టమున్న విడియోలు మాత్రమే ప్లే చేసుకోని చూసుకునేవాళ్ళం.
కాని ఇప్పుడు వాటికవే ప్లే అయిపోతాయి.మరీ దారుణమైన విషయం ఏమిటంటే, కొత్తగా వచ్చిన అప్డేట్ లో, కేవలం వీడియోనే కాదు, ఆడియో కూడా ఆటోమెటిక్ గా ప్లే అయిపోతోంది.
మీరే ఊహించుకోండి, మీరు ఫేస్ బుక్ బ్రౌజ్ చేస్తున్నారు, అనుకోకుండా ఏదో అశ్లీల వీడియో ప్లే అవడం మొదలుపెట్టింది ఫేస్ బుక్.ఎంత చంఢాలంగా ఉంటుంది.
అదీకాక ఈ వీడియోలు ఆటోమెటిక్ గా ప్లే అవుతూ మన డేటా తినేస్తున్నాయి.వైఫై ఉంటే ఫర్వాలేదు కాని మొబైల్ డేటాతో ఫెస్ బుక్ ఓపెన్ చేయాలంటే భయమేస్తోంది.
ఇలాంటి ఇబ్బందులు పడేకన్నా, ఫేస్ బుక్ అందించిన ఈ కొత్త ఆప్షన్స్ అన్నటీని ఆఫ్ చేసుకుంటే మేలు.ఎలాగో మనం ఈ ఆప్డేట్స్ తీసేయమన్నా ఫేస్ బుక్ తీసేయదు.
ఎందుకంటే దానికి యూట్యూబ్ తో పోటిపడాలని ఉంది.అలాంటప్పుడు మనం చేయాల్సినదల్లా, ఈ క్రూరమైన ఆప్షన్స్ ని ఆఫ్ లో పెట్టడమే.
ఎలా పెట్టాలో తెలియదా?
మీ ఫేస్ బుక్ యాప్ ఓపెన్ చేసి, పైన, కుడివైపు చివరన మూడు గీతలు ఉన్న ట్యాబ్ మీద క్లిక్ చేయండి.ఇప్పుడు మీ ప్రొఫైల్, పేజిలు, ఫేవరేట్స్, ఫీడ్స్, యాప్స్, గ్రూప్స్, చివర్లో హెల్ప్ & సెట్టింగ్స్ కనిపిస్తాయి.
వెంటనే help & settings లోకి వెళ్ళి, ఆ తరువాత app settings మీద క్లిక్ చేసి, అక్కడే ఉన్న auto play అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.ఇప్పుడు మీకు మూడు ఆప్షన్లు దర్శనమిస్తాయి .ఒకటి on mobile data and wifi connections, రెండు on wifi connections only, మూడు never autoplay videos .ఈ మూడొవ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.అంతే పని పూర్తయింది.
ఇప్పుడు మీ టైమ్ లైన్ లోకి వెళ్ళి చూసుకోండి .మీరు ఓపెన్ చేస్తే తప్ప, వీడియో ప్లే అవదు.ఆటోమేటిక్ గా ఇటు ఆడియో కాని, వీడియో కాని రాదు.
మీకు ఇష్టమైన వీడియో మాత్రమే చూసుకోవచ్చు.