దర్శక ధీరుడు రాజమౌలి చెక్కుతున్న బాహుబలి కన్ క్లూజన్ సినిమా రిలీజ్ ముందే సంచలనాలను సృష్టిస్తుంది.బాహుబలి ది బిగినింగ్ సినిమాను బాలీవుడ్లో కరణ్ జోహార్ తీసుకున్నారు ఇప్పుడు సెకండ్ వర్షన్ కూడా ఆయన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఎటువంచి అంచనాలు లేకుండా కేవలం హిందిలోనే బాహుబలి మొదటి పార్ట్ 120 కోట్ల దాకా కలక్షన్స్ వసూళు చేసింది.ఇక టోటల్ కలక్షన్స్ 600 కోట్లు అని తెలిసిందే.
అయితే బాహుబలి-2 1000 కోట్ల మార్క్ టచ్ చేయాలని చూస్తున్నారు.ఆ క్రమంలో బాహుబలి-2 హింది శాటిలైట్ రైట్స్ భారీ మొత్తంలో అమ్ముడయ్యాయి.జీ.ఈ.సి ఛానెల్ బాహుబలి-2 శాటిలైట్ రైట్స్ ను 55 కోట్ల భారీ మొత్తంతో దక్కించుకుంది.బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను అంత మొత్తంగా తీసుకుంటారు కాని బాహుబలికి ఉన్న క్రేజ్ దృష్ట్యా సెకండ్ పార్ట్ కచ్చితంగా అంచనాలను అందుకుంటుందని అంత పెద్ద ఆఫర్ ఇచ్చారు.
ఇక కరణ్ జోహార్ హిందితో పాటుగా ఇంటర్నేషన్ రైట్స్ కూడా తీసుకున్నాడని టాక్.మరి శాటిలైట్ రైట్స్ తోనే రికార్డులను సృష్టిస్తున్న పార్ట్-2 రిలీజ్ తర్వాత ఇంకెన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.