పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్.జె.
సూర్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.అయితే సినిమాకు మొన్నటిదాకా హుశారుగా అన్న టైటిల్ పెడుతున్నారని అన్నారు.
కాని ఇదో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న కథ కాబట్టి ఓ పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నారట.ఆ టైటిలే కడప కింగ్ అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.
అదెలా అంటే ఈ సినిమాను నిర్మిస్తున్న శరత్ మరార్ ఫిల్మ్ చాంబర్ లో కడప కింగ్ టైటిల్ రిజిస్టర్ చేయించాడట.
మరి సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు హుటాహుటిన చేశాడు అంటే టైటిల్ చేస్తున్న సినిమా కోసమే అంటున్నారు.
అదీగాక సినిమా కూడా మొత్తం ఫ్యాక్షన్ కథతో నడుస్తుందని ముందునుండి చెబుతున్నారు.సో లెక్క ప్రకారం ఈ సినిమా టైటిల్ కోసమే శరత్ మరార్ కడప కింగ్ రిజిస్టర్ చేసి ఉండొచ్చని తెలుస్తుంది.
అంతేకాదు మొన్నటిదాకా సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ అంటూ చెప్పుకొచ్చిన చిత్రయూనిట్ ఇప్పుడు ఆమె డేట్స్ ఖాళీగా లేవని ప్రస్తుతం ఫుల్ క్రేజ్ మీదున్న రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకుంటున్నారని టాక్.
ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సాధ్యమైనంత వరకు పూర్తి చేసి ఈ సంవత్సరం నవంబర్లోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు.
మరి అనుకున్నట్టుగా సినిమా నవంబర్ కల్లా ఫినిష్ చేస్తారో లేదో చూడాలి.