మనిషి బండరాయిలా ఒకేచోట కూర్చోని ఉంటే ఏం బాగుంటాడు.ప్రొద్దున్నే లేవాలి, వ్యాయామం చేయాలి.
శరీరాన్ని సరైన షేప్ లో ఉంచుకోవాలి.శరీరం మన మాట వింటేనే, ఉన్న రోగాలతో పాటు కొత్తగా పుట్టుకొస్తున్న రోగాల బారి నుంచి మన బాడిని కాపాడుకోగలం.
రోజూ వ్యాయామం చేస్తే ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి దూరంగా ఉండవచ్చు అని జామా ఇంటర్నల్ మెడిసిన్ అనే మెడికల్ జర్నల్ తెలిపింది.
రోజూ వ్యాయమం చేసేవారు రక్తానికి సంబంధించిన క్యాన్సర్లు, పెద్దపేగుల క్యాన్సర్,కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపునకు సంబంధించిన క్యాన్సర్లు, తల, మెడకు సంబంధించిన క్యాన్సర్లు, మలద్వార క్యాన్సర్, ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా అనే క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్ లాంటి రకరకాల క్యాన్సర్లకి వీలైనంత దూరంగా బ్రతకొచ్చు అంట.
శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా, ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ పనిచేయాలంటే, వ్యాయామాన్ని మించిన సాధనం లేదనేది డాక్టర్ల మాట.వ్యాయామాన్ని పట్టించుకోకపోవడం వల్లే దీర్ఘకాలిక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు మనుషులు.ఇప్పటికైనా వ్యాయామం విలువ తెలుసుకుంటే మంచిది.