ఈమధ్య కాలం లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్( Re Release ) మన టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అప్పట్లో విడుదలై సంచలన విజయాలుగా నిల్చిన కొన్ని సినిమాలను నేటి టెక్నాలజీ కి తగ్గట్టుగా 4K క్వాలిటీ తో మార్చి, డాళ్బీ అట్మాస్ సౌండ్ తో ప్రేక్షకుల అభిమాన థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.
వీటికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.ఖుషి, జల్సా, తొలిప్రేమ, పోకిరి, బిజినెస్ మెన్ మరియు ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలు రీ రిలీజ్ లో ప్రభంజనం సృష్టించాయి.కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా, కొన్ని చిన్న హీరోల సినిమాలకు కూడా అద్భుతమైన ఆదరణ లభిస్తుంది.‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిన్న సినిమా రీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ పరంగా ఆల్ టైం టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిలవగా , ఇప్పుడు ‘7/G బృందావన కాలనీ ‘( 7G Brindavan Colony ) చిత్రాన్ని రీ మాస్టర్ చేసి ఈ నెల 22 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్( 7G Brindavan Colony Advance Bookings ) పలు ముఖ్యమైన ప్రాంతాలలో రెండు రోజుల క్రితమే విడుదల చేసారు.రెస్పాన్స్ అదిరిపోయింది, ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఈ సినిమాకి టికెట్స్ ప్రారంభించిన ప్రతీ చోట హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి.స్టార్ హీరోల రీ రిలీజ్ సినిమాలకు కూడా ఈ రేంజ్ లేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు కోటి రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట.
యూత్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉండడం , ముఖ్యంగా ఈ చిత్రం లోని పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం వల్ల, ఈ రీ రిలీజ్ కి ఇంత క్రేజ్ వచ్చిందని అంటున్నారు.అయితే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో ఖుషి రికార్డ్స్( Kushi Re Release ) ని బద్దలు కొట్టే సత్తా ఉందా లేదా అనేది చూడాలి.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన ఖుషి చిత్రానికి ఫుల్ రన్ లో దాదాపుగా 7 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఈ రికార్డు ని కొట్టడానికి చాలా సినిమాలు ప్రయత్నం చేసాయి కానీ, ఒక్కటి కూడా దరిదాపుల్లోకి రాలేకపోయాయి.‘బిజినెస్ మెన్’ చిత్రం కూడా దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది కానీ, ఖుషి కి దగ్గర్లో రాలేకపోయింది.మరి ఈ సినిమా అయినా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సినిమా కాబట్టి కచ్చితంగా బ్రేక్ చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.