హిరోషిమా, నాగసాకి ఘటనకు నేటితో 75 ఏళ్లు... అప్పట్లో మరి ఎంతమంది బలి అయ్యారో తెలుసా...?

ప్రస్తుతం ఒకవైపు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతుంటే మరోవైపు హీరోషిమా పట్టణ ప్రజలు ఈ సంవత్సరము 75వ వార్షిక దినోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ దేశంలోని హిరోషిమా నగరంపై అగ్రరాజ్యమైన అమెరికా దేశం అణు బాంబుల దాడికి పాలుపడింది.

 75 Years For Hiroshima Bomb In Japan, First Atomic Bombing, Hiroshima And Nagasa-TeluguStop.com

ఈ సంఘటన జరిగి నేటితో 75 సంవత్సరములు పూర్తయింది.ఈ సందర్భంగా హీరోషియా దేశ ప్రజలు 75 వ వార్షిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

హీరోషిమా నగరంపై 1945 సంవత్సరములో ఆగస్టు 6 న అణు బాంబుల దాడి జరింగింది.

ఈ అణు బాంబు దాడిలో మరణించిన వారి జ్ఞాపకార్ధము ఈరోజు 75 వ వార్షిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో జపాన్ దేశం లొంగిపోయిన మూడు రోజుల అనంతరం అమెరికా వాయుసేనలు హీరోషిమా, నాగసాకి అనే రెండు నగరాలపై అణ్వాయుధాలతో దాడి చేసింది.ఈ దాడిలో హిరోషిమా నగరంలో ఒక లక్షా నలభై వేల మంది ప్రాణాలు కోల్పొయారు.

నాగసాకి నగరంలో డెబ్బై వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు.వేలాది ప్రజలు తమ శరీర అవయవాలను కోల్పోయారు.

నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా ఆ నగరములో వెంటాడుతూనే ఉన్నాయి.అణు బాంబుల పరిస్థితి వల్ల కొన్ని ప్రదేశాలలోని భూమి మీద ఇంతవరకూ గడ్డి కూడా మొలవ లేదు.

దీనిని బట్టి ఆ అను బాంబులు ఎంత శక్తివంతమైనదో మనము ఊహించవచ్చు.

Telugu Hiroshimabomb, America, Atomic, Hiroshima, Japan, Nagasaki, Nuclear-

అంతర్జాతీయ భద్రతకు అణ్వాయుధాలు పెనుముప్పుగా మారుతున్నాయని, ఈ దిశగా ప్రపంచ దేశాలు ఎన్ని మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హీరోషిమా ప్రభుత్వము అన్ని అగ్రరాజ్యాలను కోరుకుంటున్నది.ప్రపంచ శాంతి స్థాపనకు అందరూ కలసికట్టుగా తమ వంతు కృషి చేయాలని, ఆకాంక్షిస్తుంది.కొన్ని అగ్రరాజ్యాలు మేమే గొప్పగా ఉండాలన్న విధానాన్ని మార్చుకోవాలని తెలుపుతుంది.

ప్రపంచంలోని అగ్రదేశాలు తమ మధ్య ఉన్న వివాదాలను పరస్పర శాంతియుత చర్చలతో పరిష్కరించుకొనుట అందరికీ ఉత్తమమైన పద్ధతి.ఏ దేశం కూడా యుద్ధాల జోలికి పోవద్దని మనసారా జపాన్ ప్రభుత్వము కోరుకుంటున్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube