దేశ వ్యాప్తంగా మహిళలకి రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు మరియు కఠినమైన శిక్షలు అమలులోకి తెచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు మాత్రం అస్సలు ఆగడం లేదు.కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అభం శుభం తెలియని 6 సంవత్సరాలు కలిగిన చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన మరవక ముందే మరో మైనర్ బాలికపై దాదాపుగా 30 మంది అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రం లోని “థానే” జిల్లా పరిసర ప్రాంతంలో ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది.ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన స్నేహితుడు ఇంటికి వచ్చి మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం చేశాడు.
అంతటితో ఆగకుండా ఈ దుర్ఘటనని వీడియో కూడా తీశాడు.అనంతరం ఆ వీడియో ని తన స్నేహితులకి కూడా పంపించడంతో వాళ్లు ఇతరులకు షేర్ చేసి ఇలా దాదాపుగా 30 మందికి పైగా 9 నెలల పాటు మైనర్ బాలికపై తమ కామ వాంఛలను తీర్చుకుంటున్నారు.
ఈ క్రమంలో ఈ విషయం గురించి ఇతరులకు తెలియజేస్తే చంపేస్తామని బెదిరించారు.దీంతో బాలిక కిక్కురమనకుండా ఉండి పోయింది.
అయితే ఇటీవలే బాలిక ప్రైవేటు శరీర భాగాల వద్ద నొప్పి రావడంతో తన తల్లికి తెలియజేసింది.దీంతో విషయం అర్థం చేసుకున్న బాలిక తల్లి ఏం జరిగిందని నిలదీయడంతో గత కొద్ది రోజులుగా తాను అనుభవిస్తున్న నరకం గురించి తన తల్లితో చెప్పుకుని విలపించింది.దీంతో వెంటనే బాలిక కుటుంబ సభ్యులు బాధితురాలిని వెంట బెట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ని సంప్రదించి పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపుగా 23 మందికి పైగా అరెస్టు చేసి విచారణ చేపట్టారు.