ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన( Janasena ) 21 స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నా అనుకూలంగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు.21 నియోజకవర్గాల్లో 12 నుంచి 14 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ కు సానుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు ఇందుకు కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి( TDP BJP Janasena Alliance ) అధికారంలోకి వచ్చినా రాకపోయినా జనసేన మాత్రం తక్కువ స్థానాల్లో పోటీ చేసి 60 శాతానికి పైగా స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటడం గ్యారంటీ అని తెలుస్తోంది.వైసీపీ ఎంత ప్రయత్నిస్తున్నా పిఠాపురంలో ( Pithapuram ) పవన్ ను ఓడించడం అసాధ్యమని తేలిపోయిందని సమాచారం అందుతోంది.
పిఠాపురం జనసేనకు కంచుకోట కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల్లో గెలుపు కోసం పవన్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు.ఈ ఎన్నికల కోసం జనసేన ఒకింత ఎక్కువ మొత్తం ఖర్చు చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.జనసేనకు టీడీపీ నుంచి ఆర్థికంగా సపోర్ట్ లభించనుందని తెలుస్తోంది.
పవన్ ఎన్నికలకు సంబంధించి తెలివిగానే అడుగులు వేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తే 2029 ఎన్నికల సమయానికి జనసేన మరింత సత్తా చాటేలా పవన్ అడుగులు పడనున్నాయి.పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఆయన ఆలోచనా విధానం సైతం మారే అవకాశం ఉంటుంది.జనసేన చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధిస్తే ఏపీ ప్రజల కోసం పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
జనసేన పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ దశ కూడా మారుతుందని పవన్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.