సూపర్ స్టార్ మహేష్‌బాబుతో వరుసగా మూడు సినిమాలు నిర్మించిన 14 రీల్స్ నిర్మాతలు ప్రస్తుతం ఆయనపై ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.వరుసగా మూడు సినిమాలకు భారీ డీల్‌ను మహేష్‌బాబు 14 రీల్స్ సంస్థతో కుదుర్చుకున్నాడు.
ఆ మూడు సినిమాల్లో ‘దూకుడు’ మినహా ‘1’, ‘ఆగడు’ సినిమాలు డిజాస్టర్‌గా మిగిలాయి.దాంతో 14 రీల్స్ నిర్మాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
అయితే ఈ సమయంలో వీరికి మహేష్ నుండి సాయం అందుతుందని వారు కోరుకున్నారు.కాని మహేష్ వీరికి మొండి చేయి చూపించినట్లుగా వారు చెబుతున్నారు.
మహేష్‌బాబుకు 14 రీల్స్‌కు మద్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆ మూడు సినిమాలు ఫ్లాప్ అయితే మరో సినిమాను మహేష్‌బాబు చేయాల్సి ఉంది.కాని మహేష్‌బాబు 14 రీల్స్ నిర్మాతలకు ఏమాత్రం సాయంగా నివడం లేదు.
ఫ్రీగా కాకున్నా పారితోషికం తీసుకుని అయినా నటించడానికి మహేష్ ఒప్పుకోవడం లేదని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ సినిమాతో బిజీగా ఉన్న మహేష్‌బాబు ఆ తర్వాత ప్రసాద్ వి పొట్లూరి బ్యానర్లో నటించాల్సి ఉంది.
ఇలా రెండు సంవత్సరాల వరకు మహేష్‌బాబు వరుసగా సినిమాలు వేరే నిర్మాతలకు డేట్లు కేటాయించాడు.దాంతో 14 రీల్స్‌కు మహేష్ డేట్లు ఇచ్చే అవకాశం లేదు.