ఖమ్మం: మంత్రికి పోలీసులు దాసోహం: కాంగ్రెస్ నాయకులు ఆరోపణ

తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారని, ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కనుసన్నల్లోనే పోలీస్ యంత్రాంగం అంతా నలిగిపోతు పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గా ప్రసాద్ ఆరోపించారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మంత్రి ఏది చెబితే అదే అన్నట్టుగా వ్యతిరేకంగా మాట్లాడే వారిపై పోలీసులు అక్రమ కేసులు బాణాయిస్తున్నారని మండిపడ్డారు .

 Khammam: Police To Minister Dasoham: Congress Leaders Accused-TeluguStop.com

నేడు కాంగ్రెస్ కార్పొరేటర్లపై జరిగే దాడులు ఇందుకు నిదర్శనంగాఉన్నాయని అన్నారు .కాంగ్రెస్ కార్పొరేటర్లపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి అణచివేయడం హేయమైన చర్య అని అన్నారు .అధికారం చేతులో ఉంది కదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని, అక్రమాలకు పాల్పడుతూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు .ప్రజాస్వామ్య బద్దంగా నడవాల్సిన వ్యవస్థలే నేడు ఒకరి చెప్పు చేతల్లో ఉంటే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతుంది అన్నారు .పదువులు ఎవరికీ శాశ్వతం కాదని , ప్రజలు త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి తగు బుద్ధి చెబుతారని అన్నారు .ఇకనైనా కాంగ్రెస్ కార్పొరేటర్లపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు .లేదంటే అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావీద్ , స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన రాయల నాగేశ్వర్రావు , మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య , ఖమ్మం నగర కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల నరేందర్ , రఫీదా భేగం , మలీద్ వెంకటేశ్వరరావు , దుద్దుకూరి వెంకటేశ్వర్లు , లకావత్ సైదులు , బద్దె నిరంజన్ , సరితా ఉపేందర్ , కామేపల్లి జెడ్పిటీసీ భాణోత్ ప్రవీణ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube