హైదరాబాద్, 21st జూలై, 2022: తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు తమవంతుసాయంగా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ‘జీ తెలుగు‘ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ సందర్బంగా మొదలుపెట్టిన ‘బ్లాక్‌బోర్డ్స్ ఫర్ బ్రైటర్ డ్రీమ్స్‘ అనే కార్యక్రమం ఇటీవలే ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది.వేసవి సెలవులను అద్భుతంగా ఉపయోగించుకొని, ‘జీ తెలుగు’ ఇప్పటివరకు అక్షరాలా ఐదువందల బ్లాక్‌బోర్డ్స్ ని పునరుద్ధగించగలిగింది.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బండారుగూడెం ప్రభుత్వ పాఠశాలలోపునరుద్దరించబడిన బ్లాక్‌బోర్డ్ తో ‘జీ తెలుగు’ 500వ మైలురాయిని చేరుకుంది.ఈ విజయాన్నిపురస్కరించుకుని ఈ పాఠశాలలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడి విద్యార్థులు మరియు మీడియా సమక్షంలో బ్లాక్‌బోర్డ్‌ను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్బంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరి ఆకాంక్షలు మరియు కలలను ఆవిష్కరిస్తూ ఒక అద్భుతమైన వీడియోను విడుదల చేసింది ‘జీ తెలుగు’.ఆరంభం ఒక్క అడుగుతోనే అన్న ‘జీ తెలుగు’ నినాదం ఇందులో ప్రధానంగా ప్రతిధ్వనించింది.
కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, కరీంనగర్ మొదలుకొని మొత్తం తెలంగాణకు చెందిన 13 జిల్లాల్లో ఈ బ్లాక్‌బోర్డ్‌లు విజయవంతంగా పునరుద్ధరింపబడ్డాయి.ఐతే, ఈ కార్యక్రమానికి ఎక్కడ భీజాలు పడ్డాయో తెలుసుకోవాలంటే కాస్త వెనక్కివెళ్లాల్సిందే.‘జీ తెలుగు’ ఫిక్షన్, నాన్ ఫిక్టన్ షో ల గురించి ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరించే ప్రక్రియలో భాగంగా వివిధ పట్టణాలు మరియు గ్రామాలలో సర్వే చేసే సమయంలో అనేక పాఠశాలల్లో శితిలావస్థకు చేరుకున్న బ్లాక్‌బోర్డ్‌ల పరిస్థితులను ‘జీ తెలుగు’ టీం గమనించింది.ఎన్ని వీలైతే అన్ని బ్లాక్‌బోర్డ్‌ల పరిస్థితులను మెరుగుచేసి లక్షలాది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేయాలనే లక్ష్యంతో, ‘జీ తెలుగు’ ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టింది.మొదలుపెట్టడమే కాకుండా దాన్ని కార్యాచరణలో పెట్టి చూపించింది.ఈ సందర్భంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ శ్రీమతి అనురాధ గూడూరు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలలో చదువుకుంటున్న ఎంతోమంది పిల్లల జీవితాలలో వెలుగులు నింపాలనే ఆశయంతో ‘బ్లాక్‌బోర్డ్స్ ఫర్ బ్రైటర్ డ్రీమ్స్’ మొదలుపెట్టామని చెప్పారు.అలాగే, ఈకార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఎలాంటి సంఖ్యకు పరిమితమవాలని అనుకోలేదని, లక్షలాది విద్యార్థులకి దీనివల్ల జరుగుతున్న మంచిని దృష్టిలో పెట్టుకొని దీనిని కొనసాగిస్తామని ఆవిడపేర్కొన్నారు.‘జీ తెలుగు’ ఇలాంటి సామజిక కార్యక్రమాలతో మరియు ఆలోచనరేకెత్తించే కంటెంట్ తో ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందని అనురాధ తెలియజేసారు.