అద్భుతం.. వాగు మ‌త్త‌డి వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మైన గంగ‌మ్మ‌త‌ల్లి విగ్ర‌హం..!

ఈ సృష్టిలో జ‌రిగి కొన్ని వింతులు, విశేషాలు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.ఎందుకంటే అవి ఊహ‌కు కూడా అంద‌ర‌కుండా అస‌లు నింజ‌గా అలా జ‌రుగుతుందా అనేంత‌లా అవి ఉంటాయి కాబట్టే ఇప్ప‌టి దాకా జ‌రిగిన ప్ర‌తి వింత కూడా కొన్ని దేవుళ్ల‌కు ఆపాదిస్తూ జ‌రుగుతుంటే మ‌రి కొన్ని ప్ర‌కృతిలో జ‌రుగుతున్నాయి.

 Awesome Statue Of Ganga Visible At Vagu Muttadi , Idol, Nellure, Gandavaram, P-TeluguStop.com

ఇక దేవుళ్ల‌కు సంబంధించిన అనేక ఘ‌ట‌న‌లు మ‌న కండ్ల‌ను కూడా మైమ‌రిపిస్తుంటాయి.దేవుళ్ల రూపంలో చాలా వాటిల్లో బ‌య‌ట ప‌డ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఇక ఇప్పుడు కూడా బ‌య‌ట ప‌డ్డ ఓ విగ్ర‌హం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా విస్తారంగా వాన‌లు కురుస్తున్నాయి.

ఇక నెల్లూరు జిల్లాలో కూడా ప్ర‌స్తుతం భారీ వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి.ఈ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని మండ‌లాల్లో, ఊర్ల‌ళ్లో ఉన్న వాగులు, వంకలు విప‌రీతంగా పొంగి పొర్లుతున్నాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు.

ఇక ఇదే క్రమంలో ఈ జిల్లాలోని కొడవలూరు మండలంలోని ఊర్ల‌ళ్లో వాగులు, వంక‌లు బాగానే పొంగుతున్నాయి.ఇక ఇదే మండ‌లంలోని గండవరం గ్రామసమీపంలోని పైడేరు వాగు పారుతుండ‌గా అక్క‌డ వాగు మ‌ధ్య‌లో మ‌త్త‌డి వ‌ద్ద అనూహ్యంగా ఓ విగ్రహం ప్రత్యక్షమైంది.

Telugu Awesomestatue, Gandavaram, Idol, Nellure, Pyderu Vaagu-Latest News - Telu

విస్తారంగా వ‌స్తున్నా ఈ వరదల్లో ఆ విగ్ర‌హం ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో గానీ క‌రెక్టుగా మ‌త్త‌డి వ‌ద్ద ఆగిపోవ‌డం, అది కూడా ఎవరో ప్రతిష్టించినట్టుగా విగ్ర‌హం కూర్చోవ‌డంతో అంద‌రూ విస్మ‌యానికి గుర‌వుతున్నారు.ఏకంగా గంగమ్మ తల్లే తమ గ్రామాన్ని దీవించ‌డానికి వచ్చిందంటూ గ్రామ‌స్తులు తెగ సంబురాలు చేసుకోవ‌డమే కాకుండా గుడి కూడా క‌డ‌తామంటూ ప్ర‌చారం చేస్తున్నారు.దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు పెద్ద హాట్ టాపిఇక్‌గా మారింది.అయితే ఆ విగ్ర‌హం మాత్రం ఉన్న చోట నుంచి ఎన్ని వ‌ర‌ద నీళ్లు వ‌చ్చినా కూడా జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మే విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube