డిసెంబరు 19, 2022, మధ్యాహ్నం 2 గంటల నుంచి ‘రాజేశ్వరీ విలాస్‌ కాఫీ క్లబ్‌’ గ్రాండ్‌ లాంచ్‌కు సగర్వంగా స్వాగతం పలుకుతోంది జీ తెలుగు

హైదరాబాద్, 15 డిసెంబర్ 2022: తెలుగు లోగిళ్లలో నాన్‌స్టాప్‌ , ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ జీ తెలుగు.ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సూపర్‌హిట్‌ సీరియల్స్‌ను అందించిన జీ తెలుగు ఇప్పుడు రాజేశ్వరీ విలాస్‌ కాఫీ క్లబ్‌ అనే సరికొత్త సీరియల్ తో మన ముందుకి రాబోతుంది.

 Zee Telugu Welcomes You To The Grand Launch Of Rajeshwari Vilas Coffee Club On D-TeluguStop.com

ఈ కథ రాజేశ్వరీ అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించే రాజేశ్వరి ఓ కెఫెని నడుపుతుంది.

ఎంతో పేరున్న కెఫెని దిగ్విజయంగా నడుపుతున్నా కుడా ఆమె దృష్టి ఎప్పుడు లాభాల వైపు ఉండదు.తనకు తోచినంత ప్రతీ ఒక్కరికీ సాయం చేస్తూనే ఉంటుంది.

రాజేశ్వరీ పాత్రలో లిఖిత మూర్తి నటించింది.మరోవైపు ఈ సీరియల్‌లో రుద్ర నీలకంఠ పాత్రలో ఆకర్ష్ బైరముడి నటించాడు.

హోటల్‌ బిజినెస్‌లో అప్రతిహతంగా దూసుకుపోతున్న రుద్ర కు లాభాలే పరమావధి.ఇంకా చెప్పాలంటే తన పేరునే తన బిజినెస్‌కు బ్రాండ్‌గా మార్చుకున్నాడు.

అతనికి మానవ సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలంటే ఆసక్తి ఎక్కువ.కానీ కన్నతల్లి మాటంటే రుద్ర కు గౌరవం ఎక్కువ.

రాజేశ్వరీ యొక్క మాటతీరు, ఆమె వండే వంటల రుచితో తన కెఫె ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుంది.అదే సమయంలో ఈ కెఫె రుద్ర యొక్క హోటల్‌ కంటే అద్భుతమైన బిజినెస్‌ చేస్తుంది.

ఇదే ఇద్దరి మధ్య వివాదానికి దారితీస్తుంది.మరి ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు ఒకరికొకరు పోటీగా మారతారా.? ఇక్కడే అసలు ట్విస్ట్‌ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురిచేస్తుంది.వ్యాపారం వారిద్దరిని ఒకచోట చేర్చినప్పటికీ… రుద్ర రాజేశ్వరీకి బద్ధశత్రువుగా ఎలా మారాడో తెలియాలంటే రాజేశ్వరీ విలాస్‌ కాఫీ క్లబ్‌ సీరియల్‌కు అస్సలు మిస్‌ కాకుండా చూడాల్సిందే.

రాజేశ్వరీ విలాస్‌ కాఫీ క్లబ్ లేటెస్ట్‌ ప్రోమోలు సీరియల్‌పై హైప్‌ని పెంచేశాయి.ఆ హైప్‌కు ఏమాత్రం తగ్గకుండా సీరియల్‌ రూపొందించారు దర్శక నిర్మాతలు.డిసెంబర్ 19 నుండి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సీరియల్‌ జీ తెలుగులో ప్రసారం కానుంది.చార్మినార్ నేపథ్యంలో అద్భుతంగా, ఆహ్లాదంగా రూపొందించిన ఈ సీరియల్‌ మిమ్మల్ని ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

డిసెంబరు 19 నుండి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు సరికొత్త సీరియల్‌గా రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్‌… మీ అభిమానఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ జీ తెలుగు లో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube