ఆ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయబోతున్నారా?

ఏపీ మండలి రద్దుకు అంతా సిద్దం అయ్యింది.ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంకు పంపించారు.

 Ysrcp Pilli Subash Chandrabose Mopidevi-TeluguStop.com

త్వరలోనే కేంద్రం కూడా మండలి రద్దుపై నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.ఇలాంటి సమయంలో మండలి నుండి ఉన్న ఇద్దరు మంత్రుల పరిస్థితి ఏంటీ అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు జగన్‌ ఇచ్చిన హామీ ఏంటీ ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నాడా అంటూ చర్చ జరుగుతుంది.

ఈ సమయంలోనే వైకాపా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మంత్రులు ఇద్దరు కూడా రాజీనామా చేసేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మరియు మోపిదేవి వెంకటరమణలు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందిగా సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది.మండలి రద్దుకు ముందే వీరిద్దరు రాజీనామా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుందట.

అందుకే వారు అతి త్వరలోనే రాజీనామా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.కేవలం వారిద్దరు మాత్రమే కాకుండా వైకాపాకు చెందిన ఇతర ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube