మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
ఈ మేరకు ఇద్దరి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది.
భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.భాస్కర్ రెడ్డి ఆరోగ్యం దృష్ట్యా జైలులో సరైన వైద్యం అందించాలని హైకోర్టు సూచించింది.