మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్ సూత్రధారి అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రధారని పేర్కొన్నారు.
వివేకా హత్య కేసులో వైఎస్ షర్మిల వాస్తవాలు చెప్పిందన్నారు.ఈ క్రమంలో సాక్ష్యం చెప్పిన వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉందని తెలిపారు.
కేంద్రం షర్మిలకు వై కేటగిరి భద్రత కల్పించాలని కోరారు.అదేవిధంగా వివేకా హత్య కేసుపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.