పల్లెకు పోదాం ఛలో ఛలో అన్నది పాత పాట ఫారెన్ కు ఫోదాం ఛలో ఛలో అన్నది కొత్త మాట
అక్రమాస్తుల కేసులు వాటి తీరు తెన్ను ఎలా ఉన్నా సమ్మర్ వెకేషన్ ని మాత్రం తాను ఎంత మాత్రం మిస్ చేసుకోననే చెబుతున్నారు విపక్ష నేత జగన్.తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
కానీ సీబీఐ మాత్రం మోకాలడ్డుతోంది.విడ్డూరం కాకపోతే ఇప్పుడే ఎందుకని అలా అడ్డుకొనవలె.! మొత్తానికి మే 15నుంచి న్యూజిలాండ్ వీధులలో తిరగాలని జగన్ ఆరాటం.కానీ సీబీఐ మాత్రం ససేమీరా అంటోంది.అసలీయన బెయిల్ ని రద్దు చేయాలని ఇప్పటికే ఓ పిటిషన్ని సీబీఐ ప్రత్యేక కోర్టులో నమోదుచేసింది.
ఇందుకు కారణం జగన్ సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తిస్తున్నారన్నది సీబీఐ అభియోగం.
మొన్నామధ్య మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూని సాక్షిలో బ్రాడ్ కాస్ట్ చేయడమే జగన్ తప్పిదని సంబంధిత పిటిషన్ లో పేర్కొంది.దీంతో ఫారెన్ షికారు ఇక ఉందో లేదో అన్నది తెలియాలంటే తేలాంటే ఈనెల 28 వరకూ వెయిట్ చేయాల్సిందే! మొత్తంగా రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూకి సాక్షికి తనకూ ఏ సంబంధం లేదని జగన్ తేల్చేశారు.
దీనిపై ఇప్పటికే ఆయన తరఫు లాయర్లు కూడా వాదనలు వినిపించేశారు.ఇంతటి కథలో ట్విస్ట్ ఏంటంటే సాక్షికీ తనకూ సంబంధం లేదని జగన్ చెప్పడమే!
నిజంగా లేదా మరి! అలాంటప్పుడు సంస్థ చైర్మన్ గిరీని, నిర్వహణ వ్యవహారాలను భారతి మేడమ్ ఎందుకు చూస్తున్నట్లు.
ఆ రోజు కోర్టుకు ఇచ్చిన మాట మరిచిపోయారు.ఎట్టి పరిస్థితుల్లోనూ తాను సాక్షులను ప్రభావితం చేయనని స్పష్టంగా చెప్పారా.మరి! నాటి కేసుకు సంబంధించిన వారిని ఒక్కొక్కరిగా తెరపైకి తెస్తూ మీకు మీరుగా క్లీన్ యూ ఇచ్చేసుకుంటున్నారే!! అన్నది కొందరి భయానుమానం.ఏదేమైనా సీబీఐ అభ్యంతరాలనే కోర్టు పరిగణిస్తే జగన్ టూర్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే.
ఒకవేళ బెయిల్ రద్దైతే మళ్లీ న్యాయపరమైన చిక్కులు తప్పువు.ఇంకా చెప్పాలంటే జైలు జీవితం అనుభవించకా తప్పదు.
ఈ దశలో జగన్ విన్నపాన్ని న్యాయస్థానం వినిపించుకుంటుందో లేదో అన్నది ఆసక్తిదాయక పరిణామం.