నేటి సమాజంలో యువత చిన్న చిన్న కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.క్షణికావేశంతో వారు తీసుకునే నిర్ణయాలతో తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిలించి పోతున్నారు.
కన్నవారు వారి పిల్లలను ప్రయోజకులను చేయాలని చాల కలలు కంటారు.కానీ వారు మాత్రం తల్లిదండ్రుల కలను, వారు పెట్టుకున్న ఆశలను నేలరాసి పోతున్నారు.
ఇలాంటి తరుణంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.తల్లిదండ్రులు మందలించారని యువతి బలవన్మరణానికి పాల్పడింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం మండలం కట్టపొదలవారి గూడెం గ్రామానికి చెందిన యువతి పి.లావణ్య(19) ఆత్మహత్మ చేసుకుంది.బుధవారం రాత్రి తల్లిదండ్రులు మందలించారని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.అపస్మారక స్థితికి చేరుకున్న యువతిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతు పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు విడిచింది.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం తరలించారు.తల్లిదండ్రుల నుండి మృతురాలు వివరాలు సేకరించారు.
కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అయితే పిల్లలు ఇలాంటి తప్పిదాలు చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలని అన్నారు.
పిల్లలకు పాఠశాలల్లో మానసిక మనోధైర్యం పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న ఘటనలపై వారికీ అవగాహనా కల్పించాలన్నారు.
ఆకతాయిల నుండి వారు రక్షించుకునే విధంగా కరాటే లాంటి శిక్షణ తరగతులను నిర్వహించాలి.ఇకపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా కొంత మేరకు అయినా అరికట్టాలి.