మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.ఇప్పటికే కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ బ్యూటీ, మరికొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతోంది.
అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యింది ఈ బ్యూటీ.ముంబైలోని తన నివాసంలోనే ఉంటున్న ఈ బ్యూటీ, లాక్‌డౌన్ వల్ల వంటమనిషిగా మారినట్లు ఇటీవల ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఆమె అడవిలో ఆగమైనట్లు ఓ ఫోటో పెట్టింది.నిజానికి ఆమె లాక్‌డౌన్ వల్ల ఇంటి నుండి బయటకు వెళ్లలేదట.దీంతో మహారాష్ట్రలోని థానే సమీపంలో గల అసాన్‌గౌన్ మాహులి కోట వద్ద ఉన్న దట్టమైన అడవిలో ట్రెక్కింగ్‌కు వెళ్లింది.ఓ సహచరుడితో కలిసి తమన్నా ఈ ట్రెక్కింగ్ నిర్వహించినట్లు ఆమె పేర్కొంది.
లాక్‌డౌన్ సమయంలో తనకు కొత్త ఆసక్తి ఏర్పడిందని తమన్నా పేర్కొంది.ప్రకృతిలో మమేకమై ఉండటం తనకు చాలా బాగా నచ్చిందని ఆమె అంటోంది.
మొత్తానికి లాక్‌డౌన్ పుణ్యమా అని సెలెబ్రిటీలు తమలోని కొత్త అలవాట్లు, కొత్త అభిరుచులను కనుగొన్నారు.ఇందులో తమన్నా ట్రెక్కింగ్ అంటే తనకు ఇష్టమని చెబుతోంది.ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటీమార్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ బ్యూటీ, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో ఓ కేమియో పాత్రలో నటించేందుకు తమన్నాను చిత్ర యూనిట్ సంప్రదిస్తోన్నట్లు తెలుస్తోంది.