ఆకుకూరలను తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.వారానికి రెండు సార్లు అయినా ఆకుకూర తినడం మంచిది అని నిపుణులు తెలియజేశారు.
అయితే చాల మంది ఆకుకూరల్లో పాలకూర, గోంగూరను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.అయితే తోటకూరను తినడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి నిపుణులు అంటున్నారు.
అయితే చాల మంది తోటకూరకు దూరంగా ఉంటారు.అయితే దీని వలన మీరు చాల పోషకాలను మిస్ అవుతున్నారు.
అసలు మీరు తోటకూరలో ఎం పోషకాలను కోల్పోతున్నారో ఒక్కసారి చూద్దామా.
తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది.
అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం.అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.
అయితే ఒక్కతోట కూరలోనే కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు పదార్దాలు ఎక్కువగా లభిస్తాయి.అయితే తోటకూరలో వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది.
తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.తలకు పట్టించుకుంటే మంచిది.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు.మాడు మీద చుండ్రు తగ్గుతుంది.
అయితే తోటకూరలో ఎక్కువగా ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు లభిస్తాయి.అయితే తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి.అయితే తోటకూరలో విటమిన్ A, C, D, E, K, విటమిన్ B12, B6 వంటివన్నీ లభిస్తాయి.అంతేకాదు తోటకూర కొవ్వును తగ్గిస్తుంది.రోజూ తోట కూర తింటే బరువు కూడా తగ్గుతారు.తోటకూరలోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది.
తోటకూర రక్తనాళాల్ని చురుగ్గా ఉంచుతుందని నిపుణులు తెలియజేశారు.