వార్2 సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) నటిస్తున్నారని ఇప్పటికే అధికారికంగా క్లారిటీ వచ్చింది.అయితే తారక్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారనే ప్రశ్నకు సంబంధించి వేర్వేరు సమాధానాలు వినిపించాయి.
తాజాగా టైగర్3 మూవీ రిలీజ్ కాగా ఈ సినిమాలోని పోస్ట్ క్రెడిట్ సీన్ లో వార్2 మూవీకి లీడ్ ఇవ్వడం గమనార్హం. హృతిక్( Hrithik Roshan ) పాత్రకు అశుతోష్ రాణా పాత్ర కాల్ చేసి భయంకరమైన వ్యక్తిని పరిచయం చేస్తాడు.
భారతదేశానికి ఒక కొత్త శత్రువు తయారయ్యాడని ఆ వ్యక్తి ఇప్పటివరకు ఎవరూ చూడని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని కరుడు కట్టిన సైతాన్ కంటే ఆ వ్యక్తి ప్రమాదకరమైన వాడు అని అతనితో తలపడాలంటే అతని కన్నా దారుణంగా మారిపోవాలని పేర్కొన్నారు.అతనితో పోరాటం మరణం కంటే ప్రమాదం అంటూ తారక్ గురించి ఇచ్చిన ఎలివేషన్ మాత్రం అదిరిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పూర్తిగా చీకట్లోనే ఉంటాడని అతడిని ఎదుర్కోవాలంటే నువ్వు కూడా చీకట్లోకి వెళ్లాలంటూ ఇచ్చిన ఎలివేషన్ ఆకట్టుకుంది.వార్2 సినిమాలో ( War2 )తారక్ రోల్ నెగిటివ్ షేడ్స్ తో ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది.గూస్ బంప్స్ వచ్చేలా మేకర్స్ ఎన్టీఆర్ రోల్ ను క్రియేట్ చేశారని సమాచారం అందుతోంది.వార్2 లో ఎన్టీఆర్ రోల్ ప్రత్యేకంగా ఉండబోతుందని తారక్ అందుకే ఈ సినిమాకు ఓకే చెప్పి ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ఊరమాస్ యాక్టింగ్ స్కిల్స్ ఓ మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను కచ్చితంగా సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న తారక్ రాబోయే రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం రూల్ చేసే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ వచ్చే ఏడాది నుంచి వార్2 మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది.