యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గొప్ప నటుడని కొత్తగా ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్నచిన్న ఎక్స్ ప్రెషన్లను సైతం అద్భుతంగా పలికించే టాలెంట్ తారక్ సొంతమని చెప్పవచ్చు.
తారక్ ప్రతిభా పాటవాలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.తారక్ కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే.
అయితే ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాలోని ఒక సీన్ లో తారక్ పది సెకన్ల సీన్ లో ఆరు ఎమోషన్లు పలికించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లో జెన్నీని కలిసిన తర్వాత మల్లి గురించి తెలుసుకునే ఒక సీన్ ఉంటుంది.
ఆ పది సెకన్ల సన్నివేశంలో తారక్ షాక్ కావడంతో పాటు మల్లిని ఎలా రక్షించాలో ఆలోస్తాడు.మల్లికి( Malli ) ఏం కాలేదని తను క్షేమంగానే ఉందని తెలిసి సంతోషంగా ఫీల్ కావడంతో పాటు ఆ తర్వాత జెన్నీని మల్లి గురించి అడిగే ప్రయత్నం చేస్తున్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చి భీమ్ వెనక్కు తగ్గుతాడు.

ఆ తర్వాత మల్లికి తను వచ్చినట్టు తెలియడం కోసం ఏదైనా ఇవ్వాలని భావించడంతో పాటు ఆ తర్వాత వస్తువు తయారీ కోసం వెతుకులాట మొదలుపెడతాడు.ఇలా తారక్ కేవలం పది సెకన్లలో ఆరు అద్భుతమైన ఎమోషన్స్ ను పలికించి అభిమానులను ఒకింత ఆశ్చర్యంలో ముంచెత్తారు.ఆర్ఆర్ఆర్ సినిమాను మళ్లీ చూసినప్పుడు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

వేర్వేరు భాషల్లో వేర్వేరు ఓటీటీలలో ఆర్ఆర్ఆర్ మూవీ అందుబాటులో ఉంది.ఇప్పటికీ ఈ సినిమాను చూసే ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.ఓటీటీలలో అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.