Kodali Nani : ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీపై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉంది.ఆల్రెడీ ప్రధాన పార్టీల నేతలు ప్రచారం మొదలుపెట్టేశారు.

 Kodali Nani Serious Comments On Tdp Regarding House Deed-TeluguStop.com

ఇక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల సైతం తమదైన శైలిలో నియోజకవర్గాలలో ప్రచారం చేస్తున్నారు.ఈ రకంగానే గుడివాడ వైసీపీ( YCP ) ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.ఇవే తనకు చివరి ఎన్నికలని కొద్దిరోజుల క్రితం ప్రకటించడం జరిగింది.2029 ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.అప్పటికే తన వయసు 58 అవుతుందని దాంతో.రాజకీయాలు చేయటం కుదరదని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో ఇంకా ఎన్నికలకు 50 రోజులు మాత్రమే సమయం ఉండటంతో గుడివాడ నియోజకవర్గం ( Gudivada Constituency )లో కొడాలి నాని( Kodali Nani ) భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు.దీనిలో భాగంగా గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎవరైనా అర్హత ఉండి ఇంటి స్థలం రాలేదని ఒకరితో చెప్పించినా ఎన్నికలలో పోటీ చేయనని స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీ హయాంలో గుడివాడలో సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు.

వైసీపీ పాలనలో అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చాం.చంద్రబాబు పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.

సీఎం జగన్ పాలన దేశ చరిత్రలో ఒక రికార్డు.మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిగా రావాలి అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube