సినిమా ఇండస్ట్రీలో తనదైన సేవలు అందించినందుకు చాలా మందికి రకరకాల అవార్డ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు.ఎందుకంటే వారిలోని టాలెంట్ ని గుర్తించి వాళ్లకి ఎంకరేజ్మెంట్ అందిస్తే తను ఇంకా ఇండస్ట్రీకి మెరుగైన సేవలు అందిస్తారని భావించి అలా చేస్తారు.
దానిలో భాగంగానే రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు.అయితే అందరూ ఇండియన్ సినిమా ఆద్యునిగా సత్య హరిచంద్ర సినిమా తీసిన దాదాసాహెబ్ ఫాల్కే గారిని పేర్కొంటారు.
ఆయన పేరుతోనే అవార్డు కూడా ఇస్తారు ఆఅవార్డు పొందడం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ నిజానికి ఆయన కంటే ముందే తెలుగు చిత్ర పరిశ్రమకు దక్షిణ సినీ పరిశ్రమకి ఆద్యుడు అయిన రఘుపతి వెంకయ్య నాయుడు.ఆయన పేరు మీదే రఘుపతి వెంకయ్య అనే అవార్డును రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఇచ్చినంత గుర్తింపు రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వడంలేదని అప్పట్లో దాసరి నారాయణరావు లాంటి వారు వాపోయారు.
తెలుగు తేజ మైన అతన్ని మనం గుర్తుంచుకో పోవడం నిజంగా బాధాకరమైన విషయమని చెప్పారు ఈ విషయంలో దాసరి నారాయణరావు గారు ఎంతగా ఫైట్ చేసినప్పటికీ మన ఇండస్ట్రీ నుంచి ఆయనకు సరైన సపోర్ట్ లభించలేదని చెప్పాలి.ఇండియన్ సినిమాలో మొదట థియేటర్ కట్టింది అలాగే మొదటి సినిమాకి డైరెక్షన్ చేసింది కూడా రఘుపతి వెంకయ్య నాయుడు అని చెప్పుకుంటారు.
రఘుపతి వెంకయ్య నాయుడుకి దేవిక రాణి అనే కూతురు ఉండేది అప్పుడు ఆమె హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని అనుభవించిందని చెప్పాలి.స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన తర్వాత ఆమె దేవదాసు అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి కనకమహాలక్ష్మి అనే కూతురు కూడా ఉంది ఆమెని అందరూ కనిక అని పిలుస్తారు.
కనక తెలుగులో విజయబాపినీడు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన వాలుజడ తోలుబెల్టు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైంది.కనిక తమిళ తెలుగు భాషల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధించింది.

తమిళంలో మొదటి సినిమా సాంప్రదాయ నృత్యమైన కరగటం ఆధారంగా తీసిన కరకకట్టాకరణ్ అనే సినిమాతో మంచి గుర్తింపును సాధించింది ఆ తర్వాత తను వెనుదిరిగి చూడకుండా చాలా సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధిస్తూ రఘుపతి వెంకయ్య నాయుడు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచి నటిగా గుర్తింపు పొందుతూ తల్లికి తగ్గ తనయురాలుగా గుర్తింపును సాధించింది.ఆవిడ తమిళంలో అర్జున్, శరత్ కుమార్ లాంటి హీరోలతో నటించి మంచి గుర్తింపును సాధించింది అలాగే మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ యాక్టర్స్ తో నటించి తనకంటూ మలయాళంలో కూడా మంచి గుర్తింపు సాధించింది ఆమె హీరోయిన్ గా కొనసాగుతున్న అప్పుడే అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ముత్తుకుమార్ నీ కాలిఫోర్నియాలో ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు ఆవిడ చెప్పారు కానీ అది జరిగిన పదిహేను రోజులకి ఒక సినిమా ఫైనాన్షియర్ తన భర్తని కిడ్నాప్ చేశారని చెప్పారు అయితే దీంతో వాళ్ళ నాన్న తన కూతురికి ఎవరితో పెళ్లి కాలేదని తనకు మతిస్థిమితం సరిగా ఉండటం లేదని చెప్పాడు.

ఆమె తల్లి దేవిక చనిపోయిన తర్వాత ఆమె సినిమాలో నటించడం మానేశారు దాంతో చాలా రోజుల వరకు ఎవరికీ కనిపించకపోవడంతో తను క్యాన్సర్ తో చనిపోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి దాంతో కనిక మీడియా ముందుకు వచ్చి నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఎందుకిలా ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేస్తున్నారు అని మీడియా వాళ్లకి గట్టిగా సమాధానం చెప్పి వెళ్ళిపోయారు.ఏది ఏమైనప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆవిడకి సరైన గుర్తింపు లభించడం లేదనే చెప్పాలి రఘుపతి వెంకయ్య ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన కనీస బాధ్యత ఇండస్ట్రీపై ఉండేది.ఆవిడకి మతిస్థిమితం సరిగా ఉండటం లేదు అని తెలిసినప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా బాధపడాల్సిన విషయం.సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా నటించినప్పటికీ తన గురించి పట్టించుకునే వారు లేక పోవడంతో తను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది.
తన పరిస్థితి దుర్భరంగా మారిందని చాలాసార్లు తను బాధ పడినట్లు సన్నిహితులు తెలియజేస్తూ ఉంటారు
.
Channels
Telugu HomeEnglish NewsTeluguStop Exclusive StoriesTelugu Flash/Breaking NewsTelugu Trending NewsTelugu PoliticalTelugu MovieTelugu Health TipsTelugu GossipsTelugu Crime NewsTelugu Movie ReviewsTelugu NRI NewsTelugu Viral VideosTelugu Bhakthi/DevotionalTelugu Press ReleasesTelugu Viral StoriesTelugu QuotesTelugu Photo GalleriesTelugu Photo TalksTelugu Baby Boy NamesTelugu Baby Girl NamesTelugu Celebrity ProfilesFollow Us!
Contact Us!
[email protected]About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy