ఏపీలోని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రాష్ట్ర హైకోర్టు( High Court )ను ఆశ్రయించారు.ఈ మేరకు ఏపీ స్పీకర్ నోటీసులను రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయస్థానంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ రెబెల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు హైకోర్టులో ఉండవల్లి శ్రీదేవి( Vundavalli Sridevi ), ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి( Mekapati ChandraSekhar Reddy ) మరియు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.మరోవైపు మండలి చైర్మన్ నోటీసును ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా న్యాయస్థానంలో సవాల్ చేశారు.కాగా ఈ పిటిషన్లపై కోర్టులో విచారణ జరగనుంది.