టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శివాజీ ( Shivaji ) ఒకరు.ఈయన ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేవారు.
కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించినటువంటి శివాజీ ఇటీవల బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో పాల్గొన్నారు.బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈయనకు రావాల్సిన పబ్లిసిటీ వచ్చిందనే చెప్పాలి.
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు పొందినటువంటి ఈయన 90s వెబ్ సిరీస్ విడుదల చేశారు.ఇది కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
ఈ వెబ్ సిరీస్( 90s Webseries ) మంచి సక్సెస్ కావడంతో శివాజీ ఈ సిరీస్ ప్రమోట్ చేస్తూ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన మాట్లాడుతూ తాను తిరిగి ఇండస్ట్రీలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నానని నేను సినిమాలలో నటించాలని నా పిల్లలు కోరుకుంటున్నట్లు శివాజీ తెలిపారు.ఇక టాలీవుడ్ హీరోల( Tollywood Heroes ) గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలలో తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు.
ఈయన నటన మరో లెవెల్ లో ఉంటుందని తెలియజేశారు.
తనకు అల్లు అర్జున్ ( Allu Arjun ) తో పాటు జాతి రత్నాల హీరో నవీన్ పోలిశెట్టి( Naveen Polisetty ) బాగా ఇష్టమని అదే విధంగా తేజ నటన కూడా అద్భుతంగా ఉంటుందని ఈయన తెలిపారు.అదేవిధంగా తనకు ఇష్టమైనటువంటి దర్శకుల గురించి కూడా శివాజీ ఈ సందర్భంగా మాట్లాడారు.అనిల్ రావిపూడి, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల, రామ్ అబ్బరాజు మంచి నైపుణ్యం కలిగిన దర్శకులు అంటూ వీరి పట్ల కూడా శివాజీ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈయన తరచూ ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.