తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్( Director Sukumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు దర్శకుడు సుకుమార్.
అల్లు అర్జున్ తో తెరకెక్కించిన పుష్ప మూవీ( Pushpa ) తో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇక అదే ఊపుతో ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే పుష్ప పార్ట్ 2 సినిమా( Pushpa Part 2 )ను ఆగస్టు 15 విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మూడు ప్రకటించిన విషయం తెలిసిందే.ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే సునీల్, అనసూయ, లాంటి వారు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.కాగా దర్శకుడు సుకుమార్ సినిమాలో పరంగా ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి సరదాగా కాసేపు టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు.
భాగంగానే తాజాకా సుకుమార్ తన కూతురు, కొడుకు భార్యతో కలిసి సరదాగా సమయాన్ని గడిపారు.తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఆమె బర్త్డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు.
అలా తన కూతురు బర్త్డే పార్టీలో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తన కూతురు సుకృతివేణి( Sukumar Daughter Sukruthiveni ) బర్త్ డే సెలబ్రెషన్స్ గ్రాండ్ గా జరిగాయి.ఆ ఫోటోలను చూసిన అభిమానులు నెటిజన్స్ ఏంటి సుకుమార్ కి ఏకంగా ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.త్వరలోనే ఈ పాప హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం పక్కా హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ కి మరొక హీరోయిన్ దొరికేసింది అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.