ఆది పురుష్(Adipurush) ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం సాయంత్రం తిరుపతిలో(Tirupathi) ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ వేడుక కోసం పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
ఇక ఈ వేడుకలో భాగంగా నటుడు ప్రభాస్ చాలా అందంగా ఆకర్షణీగా కనిపించారని చెప్పాలి.దీంతో ప్రభాస్ అందం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అదే విధంగా ఈ వేడుకలో భాగంగా ప్రభాస్ ధరించిన డ్రెస్(Prabhas Dress) కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ వేడుకలో ప్రభాస్ తెలుపు రంగు దుస్తులు ధరించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈయన తెలుపు రంగు దుస్తులు ధరించడంతో ప్రతి ఒక్కరు ఈ డ్రెస్ గురించి చర్చలు మొదలుపెట్టారు.ప్రభాస్ ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంత ఉంటుందన్న విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.అయితే ప్రభాస్ ఈ సినిమాలో వేసుకున్నటువంటి ఈ డ్రెస్ ను ఆయనకు కానుకగా ఇచ్చారని తెలుస్తుంది.ప్రభాస్ కోసం ప్రత్యేకంగా డైరెక్టర్ ఓ రౌత్ (Om Rauth) స్పెషల్ డిజైనర్ తో డిజైన్ చేయించారని తెలుస్తుంది.
ఇలా ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఈ డ్రెస్ తయారు చేయించి ఆయనకు కానుకగా ఇవ్వడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ప్రభాస్ అదే డ్రస్సును వేసుకున్నారు.
ఈ సినిమా వేడుకల్లో భాగంగా ఈయన ధరించిన ఈ డ్రెస్ ఖరీదు తెలిసి ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతున్నారు.బాలీవుడ్ సమాచారం ప్రకారం ఓం రౌత్ ప్రభాస్ కోసం సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు చేసి స్పెషల్ గా ఈ డ్రెస్ డిజైన్ చేశారని తెలుస్తోంది.మరి ప్రభాస్ డ్రెస్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఆయన డ్రెస్ ఖరీదు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పాన్ ఇండియా స్టార్ హీరో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఈయన 10 లక్షలు పెట్టి డ్రెస్ కొనడం సాధారణమైన విషయమనే చెప్పాలి.