ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌక మోడీ చేతుల మీదుగా నేడే ప్రారంభం... దాని పేరు ఇదే!

అవును, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ అంటే సుదీర్ఘ ప్ర‌యాణం చేసే న‌దీ ప‌ర్య‌ట‌క నౌకను నేడు మనదేశ ప్రధాన మంత్రి అయినటువంటి మోడీ దిగ్విజయంగా ప్రారంభించనున్నారు.ఇక దాని నామకరణం గంగా విలాస్.

 World's Largest River Cruise Ship Launched Today At The Hands Of Modi. Its Name-TeluguStop.com

ఈరోజు అనగా శుక్రవారం నాడు వారణాసిలో ప్రారంభించనున్నారు.ఈ నౌక వారణాసి నుండి భారతదేశం, బంగ్లాదేశ్ లోని 5 రాష్ట్రాలను కలుపుకొని 27 నదీ వ్యవస్థల గుండా దాదాపు 3,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా మ‌రికొద్ది క్ష‌ణాల్లోనే ఈ గంగా విలాస్ త‌న ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌నుందని తెలుస్తోంది.ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ ఓ ప్రకటన చేసింది.

దాని సమాచారం ప్ర‌కారం.ఈ క్రూయిజ్ ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూగఢ్ కు ప్రయాణిస్తుంది.

వారు మాట్లాడుతూ.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనవరి 13న ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది యాత్ర చేసే రివ‌ర్ క్రూయిజ్ గంగా విలాస్ ను జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు.” అని సగర్వంగా పేర్కొన్నారు.

ఇది 27 నదీ వ్యవస్థల మీదుగా పర్యాటకులను తీసుకెళ్తుంది.అలాగే వివిధ ప్రముఖ గమ్యస్థానాల గుండా ప్రయాణిస్తుంది.ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ లక్నోలో విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ పార్కులు, నదీ ఘాట్‌లు మరియు బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని షాహిగంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రాంతాలను ఈ క్రూజ్ కవర్ చేస్తుందని తెలుస్తోంది.

అలాగే బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గౌహతి తదితర ప్రాంతాలను టచ్ చేస్తూ పర్యాటకాలును అలరిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube