'దున్నపోతు' సమస్యకు పరిష్కారం దొరికేసింది... అసలు కథ ఇదే?

రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన అమ్మవారి దున్నపోతు సమస్య మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది.వివరాల్లోకి వెళితే, తమకి అందుబాటులో ఉన్న ఒకే ఒక దున్నపోతుతో అంబాపురం, రచ్చుమర్రి గ్రామస్తులు ఊరి దేవర జరుపుకునేందుకు సంసిద్ధమయ్యారు.

 Anantapur Buffalo Controversy Finally Solved Details, Buffello Problem, Solved,-TeluguStop.com

ఈ క్రమంలో దున్నపోతు తమదంటే తమదంటూ ఇరు గ్రామాల ప్రజలు యుద్ధానికి దిగారు.దాదాపు ఈ తతంగం 20 రోజులుగా సాగుతోందని మీకు తెలిసిందే.

ఈ నెల 17న అంబాపురంలో దేవర నిర్వహించాలని గ్రామస్తులు అనుకున్న నేపథ్యంలో అమ్మవారి పేరుతో వదిలిన దున్నపోతు కోసం దాదాపు 30 రోజులకు పైగా వివిధ ప్రాంతాల్లో గాలించి చివరకు బొమ్మనహాళ్ మండలంలో కనిపించిన దేవరపోతును తీసుకెళ్లి బంధించారు.అయితే ఈ విషయం తెలుసుకున్న రచ్చుమర్రి గ్రామస్తులు అంబాపురానికి వెళ్లి తమ గ్రామ దేవత పేరున వదిలిన దున్నపోతును మీరెలా బంధిస్తారంటూ? వారితో గొడవకు దిగారు.

Telugu Ambapuram, Anantapur, Buffalo, Ci Yugandhar, Ruchhumarri, Solved, Latest-

ఇక అప్పటి నుంచి ఈ 2 గ్రామాల మధ్య దున్నపోతు పంచాయితీ నలుగుతూ వస్తోంది.ఈ నేపథ్యంలో ఇరు గ్రామాల ప్రజలను బుధవారం కణేకల్లు పోలీస్ స్టేషన్ CI యుగంధర్ పిలిపించుకుని మాట్లాడారు.గ్రామ దేవతకు సంబంధించిన దున్నపోతును తాముకూడా వదులుకోబోమని రచ్చుమర్రి వాసులు తేల్చి చెప్పడంతో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పంచాయితీ… మధ్యాహ్నం 1 గంట వరకూ సాగింది.పలు వాదోపవాదాలు విన్న తరువాత చివరగా CI యుగంధర్ ఇరు గ్రామాల పెద్దలను కూర్చొబెట్టి చర్చలు జరిపారు.ఈ నెల 17న అంబాపురంలో దేవర ఉందని, రచ్చుమర్రిలో దేవరకు ఇంకా ఏడాది గడువు ఉండడంతో

Telugu Ambapuram, Anantapur, Buffalo, Ci Yugandhar, Ruchhumarri, Solved, Latest-

దున్నపోతు కొనుగోలుకు అంబాపురం వాసులతో డబ్బిప్పిస్తానన్నారు.ఇది దైవ కార్యం కావడంతో అందరికీ మంచి జరుగుతుందని, మరో 7 రోజుల్లో ఊరి దేవర ఉండడంతో మంచి మనసుతో ఆలోచించి అంబాపురం వాసులకు సహకరించాలని, దీంతో అమ్మవారు కూడా శాంతిస్తారని సీఐ నచ్చచెప్పారు.దాంతో ఇరు గ్రామాల మధ్య రాజీ కుదిరింది.ఎట్టకేలకు దున్నపోతు సమస్యకు పరిష్కారం దక్కడంతో అంబాపురం వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube